Medico Preethi Death: మెడికో ప్రీతి మృతి కేసులో సైఫ్‌కు 10ఏళ్ల జైలు ?

Medico Preethi Death: సంచలనం సృష్టించిన మెడికో ప్రీతి మృతి ఘటనలో మరో మెడికో సైఫ్ కు శిక్ష తప్పదా.

Update: 2023-03-21 06:36 GMT

Medico Preethi Death: మెడికో ప్రీతి మృతి కేసులో సైఫ్‌కు 10ఏళ్ల జైలు ?

Medico Preethi Death: సంచలనం సృష్టించిన మెడికో ప్రీతి మృతి ఘటనలో మరో మెడికో సైఫ్ కు శిక్ష తప్పదా. ప్రీతి ది సాధారణ మరణం అయినా సైఫ్ పదేళ్ళు జైల్ కు వెళ్ళాల్సిందేనా... అంటే ఔననే సమాధానం వస్తుంది.‌ ప్రీతిది ఆత్మహత్యనా... హత్యనా అనేది ఇంకా ఏమీ తేలకపోయినప్పటికీ ప్రీతి మృతికి కారణం ర్యాగింగేనని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ర్యాగింగ్ యాక్ట్ తో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద సైఫ్ కు శిక్ష పడుతుందంటున్నారు వరంగల్ సీపీ రంగనాథ్.

సైఫ్ తో పాటు ఒకరిద్దరిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కేసును చాలెంజ్ గా తీసుకొని అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని వరంగల్ సీపీ రంగనాథ్. స్పష్టం చేశారు. సరిగ్గా నెలరోజుల క్రితం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మెడికో ప్రీతి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. నిమ్స్ కు తరలించి మెరుగైన వైద్యం అందించినా ప్రీతి ప్రాణాలు కోల్పోయారు. ప్రీతి మృతి పై అనేక అనుమానాలు, ఆందోళనలు వ్యక్తం కావడంతో పోలీసులు విచారణ చేపట్టి సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ వేధింపులు ర్యాగింగే కారణమని తేల్చారు.

సైఫ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ముందుగా ప్రీతి మత్తు ఇంజక్షన్ తీసుకొని ఆత్మహత్య చేసుకుందని భావించినప్పటికీ టాక్సికాలజీ రిపోర్టులో ఎలాంటి మత్తు రసాయనాలు తీసుకున్నట్టు ఆధారాలు లభించలేదు. ఎవరైనా హత్య చేశారా అంటే అందుకు సంబంధించి ఎవిడెన్స్ దొరకలేదు. హత్య కాదు... ఆత్మహత్య చేసుకోలేదు.. మరి ప్రీతి ఎలా చనిపోయిందనేది ఇప్పుడు అందరి మదిని తోలుస్తున్న ప్రశ్న. పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతిగా బావిస్తూ అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే కానీ ఫైనల్ నిర్ణయానికి రాలేమంటున్నారు వరంగల్ సీపీ రంగనాథ్.

ఒకవేళ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినా, సాధారణ మరణమే అయినా అందుకు ర్యాగింగే కారణమని స్పష్టం చేస్తున్నారు రంగనాథ్. సైఫ్, ప్రీతి సెల్ ఫోన్ మెసేజ్ లు, వాట్సాప్ గ్రూప్ చాటింగ్‌ల ఆధారంగా ప్రీతి ర్యాగింగ్ కు గురైందని నిర్ధారించామని చెప్పారు. ర్యాగింగ్ యాక్ట్ ప్రకారం సైఫ్ కు పదేళ్ళ శిక్షతోపాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుపై శిక్ష అదనంగా ఉండే అవకాశం ఉందన్నారు.

ప్రీతి తల్లిదండ్రుల అనుమానాలను నివృత్తి చేస్తూ ఏ ఒక్క చిన్న అంశాన్ని వదిలిపెట్టకుండా అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని సీపీ రంగనాథ్ తెలిపారు. సైఫ్ తో పాటు మరో ఒకరిద్దరిపై అనుమానాలు ఉన్నాయని చెప్పారు. తప్పు చేసిన వారు తప్పించుకోవడానికి వీలు లేకుండా జాగ్రత్తగా లోతైన విచారణ చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ కేసు విషయంలో నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చారని, కేసును చాలెంజ్ గా తీసుకుని తప్పు చేసిన వారికి శిక్ష పడేలా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు.

Tags:    

Similar News