Gorrela Scam: గొర్రెల స్కాం కేసులో దర్యాప్తు వేగవంతం చేసిన ఏసీబీ అధికారులు

Gorrela Scam: తెలంగాణ గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్యను వివరాలు కోరిన ఏసీబీ

Update: 2024-07-08 14:24 GMT

Gorrela Scam: గొర్రెల స్కాం కేసులో దర్యాప్తు వేగవంతం చేసిన ఏసీబీ అధికారులు

Gorrela Scam: తెలంగాణలో గొర్రెల స్కాం కేసు దర్యాప్తును వేగవంతం చేస్తోంది ఏసీబీ. ఇప్పటికే ఈ కేసులో 10మందిని అరెస్ట్ చేయగా.. ఓఎస్డీ కళ్యాణ్, మాజీ డైరెక్టర్ రామచందర్ అరెస్టుతో కేసు కీలకదశకు చేరుకుంది.కస్టోడీయల్ విచారణలో వీరిద్దరూ ఎలాంటి వివరాలు తెలుపకపోవడతో.. తెలంగాణ గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్యను వివరాలు కోరారు ఏసీబీ అధికారులు. దాంతో ఏసీబీ, ఈడీలకు వివరాలు అందించే పనిలో పడ్డారు తెలంగాణ గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య అధికారులు. గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించిన వివరాల కోసం జిల్లా కలెక్టర్‌లకు లేఖ రాశారు. జిల్లాల వారీగా లబ్ధిదారుడి వాటా, సబ్సిడీ వివరాలు ఇవ్వాలన్నారు. SRDC ఆధారంగా గొర్రెలను గుర్తించి, కొనుగోలు చేసిన యూనిట్స్... లబ్ధిదారుడు, అమ్మకదారుడి వివరాలు, బ్యాంకు ఖాతా, డేట్ ఆఫ్ గ్రౌండింగ్, ట్రాన్స్‌పోర్ట్, ఇన్వాయిస్‌లతో సహా పూర్తి వివరాలు ఇవ్వాలని కోరారు.

Tags:    

Similar News