Siva Balakrishna: శివబాలకృష్ణ బెయిల్‌పై నేడు ఏసీబీ కోర్టు తీర్పు
Siva Balakrishna: బెయిల్ మంజూరు చేయొద్దని ఏసీబీ కౌంటర్ పిటిషన్
Siva Balakrishna: శివబాలకృష్ణ బెయిల్‌పై నేడు ఏసీబీ కోర్టు తీర్పు ఇవ్వనుంది. శివబాలకృష్ణ బెయిల్‌పై ఇప్పటికే వాదనలు ముగిశాయి. బెయిల్ మంజూరు చేయొద్దని ఏసీబీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల వ్యవహారంపై ఏసీబీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. కస్టడీ విచారణ సమయంలో ఓ సీనియర్ IAS అధికారి పేరును శివబాలకృష్ణ చెప్పడంతో.. అతన్ని విచారించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. న్యాయ సలహాతో నోటీసులు జారీ చేసి విచారించడానికి ఏసీబీ సిద్ధమవుతోంది. ఐఏఎస్ అధికారి ఆదేశాల మేరకు అనుమతులు జారీ చేసి కోట్ల రూపాయలను శివబాలకృష్ణ అక్రమంగా సొమ్ము చేసుకున్నట్టు ఏసీబీ భావిస్తోంది. ఇదే విషయాన్ని శివబాలకృష్ణ విచారణలో అంగీకరించినట్లు అధికారులు మాట్లాడుకుంటున్నారు. పలు స్థిరాస్తి సంస్థలకు అనుమతులు మంజూరు చేసినందుకు లభించిన సొమ్ములో ఆయన వాటాను తానే స్వయంగా తీసుకెళ్లి IAS అరవింద్ కుమార్‌కు అప్పగించినట్లు దర్యాప్తులో ఏసీబీ గుర్తించింది. సొమ్ము అప్పగించే క్రమంలోనే వారి మధ్య జరిగిన వాట్సప్ సంభాషణలు.. తెలుస్తుంది. ఇద్దరు కూడా అక్రమార్జనను ఆస్తులుగా మార్చుకునేందుకు బినామీలతోనూ సంభాషించినట్లు విచారణలో అధికారులు గుర్తించారు.
భూములు కొని రిజిస్ట్రేషన్ చేసిన సమయంలో బినామీలు అక్కడే ఉన్నట్లు నిరూపించాల్సిన అవసరం ఉంది. ఇది ఏసీబీ ముందున్న అతిపెద్ద టాస్క్. అలాగే IAS అధికారికి వాటాల సొమ్మును శివబాలకృష్ణ స్వయంగా ముట్టజెప్పిన సమయంలోనూ ఇద్దరూ ఒకే చోట ఉన్నట్లు తేల్చాల్సి ఉంది. సెల్‌ఫోన్ల డేటాను వడపోసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ మేరకు కేసును ప్రాసిక్యూషన్ చేసేందుకు ప్రభుత్వ అనుమతులను అధికారులు తీసుకోనున్నారు. స్వాధీనం చేసుకున్న ఫోన్స్, ల్యాప్‌టాప్‌లను అధికారులు ఫోరెన్సిక్ పంపించారు. వాట్సాప్, కాల్స్ డేటా రిట్రైవ్ చేసిన తర్వాత వచ్చిన డేటాతో దర్యాప్తు వేగవంతం చేయనుంది. IAS అధికారి అరవింద్ కుమార్‌కు 161 నోటీసులు ఇచ్చి విచారించేందుకు ఏసీబీ రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా శివబాలకృష్ణ బినామిలు, వెనుకుండి నడిపించిన అధికారులు, రాజకీయ ప్రముఖుల చిట్టను ఏసీబీ బయటపెట్టనుంది.