AARA Exit Polls 2024: తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లు గెలిచే పార్టీ ఇదే
AARA Exit Polls 2024: ఆరా ఎగ్జిట్ పోల్స్ 2024 ప్రకారంగా తెలంగాణలో బీజేపీ అత్యధిక ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తుంది.
AARA Exit Polls 2024: ఆరా ఎగ్జిట్ పోల్స్ 2024 ప్రకారంగా తెలంగాణలో బీజేపీ అత్యధిక ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తుంది. బీజేపీ ఎనిమిది నుండి తొమ్మిది ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆరా సంస్థ తెలిపింది. కాంగ్రెస్ పార్టీ ఏడు నుండి ఎనిమిది స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆరా సంస్థ ప్రకటించింది. హైద్రాబాద్ స్థానంలో ఎంఐఎం విజయం సాధిస్తుందని ఆ సంస్థ తెలిపింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క స్థానం కూడా దక్కదని ఆరా సంస్థ వివరించింది.
ఆదిలాబాద్, నిజామాబాద్ ,కరీంనగర్, జహీరాబాద్, మెదక్, మల్కాజిగిరి,చేవేళ్ల, సికింద్రాబాద్ స్థానాల్లో సునాయాసంగా బీజేపీ గెలుస్తుందని ఆయన చెప్పారు. గట్టి పోటీ ఉన్నా మహబూబ్ నగర్ లో బీజేపీ అభ్యర్ధి డీకే అరుణ విజయం సాధిస్తారని ఆరా సంస్థ ఛైర్మెన్ మస్తాన్ రావు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల నాటికి తెలంగాణ ఓటర్లలో మార్పు కన్పించిందని ఆ సంస్థ అభిప్రాయపడింది.
బీజేపీ: 8-9
కాంగ్రెస్: 7-8
బీఆర్ఎస్: 0
ఎంఐఎం:01