నాంపల్లిలో బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించిన ఆప్ నాయకులు
* మనీష్ సిసోడియా అరెస్ట్‌కు నిరసనగా ఆప్ ఆందోళనలు
Nampally: నాంపల్లిలో బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించారు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు. ర్యాలీగా వచ్చిన ఆప్ నాయకులు బీజేపీ కార్యాలయం వైపు దూసుకెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఆప్ తెలంగాణ శాఖ కోర్ కమిటీ సభ్యుడు డాక్టర్ సుధాకర్‌తో పాటు పలువురు ఆప్ నాయకులను అరెస్ట్ చేశారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ ఖండిస్తూ ఆప్ నాయకులు ఆందోళనలు చేపట్టారు.