
Murder: జగిత్యాలలోని ర్మపురి మండలం దమ్మన్నపేట నివాసి సర్గం శ్రీనివాస్ దుబాయ్ లో దారుణ హత్యకి గురయ్యాడు. ఈనెల 11వ తేదీ శుక్రవారం నమాజ్ అయిన తర్వాత కొందరు పాకిస్తానీ ఉగ్రవాదులు కత్తులతో హిందువులపై దాడిచేశారు. ఈ దాడిలో నిజామాబాదుకు చెందిన సాగర్, ధర్మపురి మండలానికి చెందిన శ్రీనివాస్ మరణించారు.అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ విషయంలో ఇప్పటికే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. శ్రీనివాస్ అన్నయ్య సత్యంతో మాట్లాడి వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. వారికీ తోడుగా కేంద్రప్రభుత్వం ఉంటుందని అన్నివిధాలా సహకారం అందిస్తుందని తెలిపారు. బీజేపీ తెలంగాణ శాఖ విదేశాంగ మంత్రిత్వ శాఖతో ఇప్పటికే మాట్లాడిందని, మృతుల పార్థివ దేహాన్ని వీలైనంత త్వరగా వారి గ్రామాలకు తీసుకువస్తాం అని మాట ఇచ్చారు.
ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని..ఈ అంశంపై జోక్యం చేసుకుని దుబాయ్ తోపాటు ఇతర ఇస్లాం దేశాల్లో నివసిస్తున్న తెలుగు వారికి రక్షణ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వనీదే అంటున్నారు. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు.
కాగా శ్రీనివాస్ మ్రుతితో స్వగ్రామమైన దమ్మన్నపేటలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. శ్రీనివాస్ కు భార్య మంజుల ఇద్దరు కొడుకులు ఉన్నారు.