Medchal: మ్యాన్‌హోల్‌ లో పడి నాలుగేళ్ల బాలుడు మృతి..

Medchal: వర్షానికి నాలా కనబడకుండా వరదనీరు ఉండడంతో ప్రమాదం

Update: 2023-09-05 09:58 GMT

Medchal: మ్యాన్‌హోల్‌ లో పడి నాలుగేళ్ల బాలుడు మృతి.. 

Medchal: హైదరాబాద్ లో వర్షాలు ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. వరదలకు నాలాలు, మ్యాన్‌హోల్‌లు ఉప్పొంగడంతో అమాయకులు బలి అవుతున్నారు. రోడ్లపై బార్లా తెరుచుకుని ఉంటున్న నాలాలు నగర వాసులను మింగేస్తున్నాయి. మేడ్చల్ జిల్లా బాచుపల్లిలోని సాయినగర్ లో విషాదం నెలకొంది. నాలుగేళ్ల బాలుడి నితిన్ మ్యాన్‌హోల్‌లో పడిపోయాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా మ్యాన్‌హోల్‌లో పడి చనిపోయాడు నితిన్. భారీ వర్షానికి రోడ్డుపై వరద నీరు చేరడంతో మ్యాన్‌హోల్‌ కనబడలేదు.

దీంతో ప్రమాదవశాత్తు మ్యాన్‌హోల్‌లో పడిపోయాడు బాలుడు. విషయం తెలవడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాలుగేళ్ల బాలుడిని మ్యాన్‌హోల్‌ మింగేయడంతో.. కుటుంబ సభ్యుల్లో తీరని విషాదం నెలకొంది. గ్రేటర్ లో మ్యాన్‌హోల్‌, నాలాలకు బలి కావడం సర్వసాధారణంగా మారింది. ఎప్ఫుడు వర్షం పడినా.. ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉంది. నిన్న గాంధీనగర్ లో ఓ మహిళ నాలాలో పడి చనిపోయింది.

మూడు గంటల పాటు శ్రమించిన తర్వాత ప్రగతి నగర్ లోని రాజీవ్ గృహకల్ప దగ్గర బాలుడి మృతదేహం కనిపించింది. కానీ చేతికి దొరికినట్టే దొరికి,, బయటకు తీస్తుండగా మళ్లీ బాలుడి డెడ్ బాడీ కొట్టుకుపోయింది. బాలుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇలా వరుస ఘటనలు జరుగుతున్నా.. జీహెచ్ఎంసీ అధికారుల్లో చలనం రావడం లేదు. రోడ్లపై నాలాలను మూసి పెట్టుకుండా.. నిర్లక్ష్యంగా వ్యహరిస్తూ ప్రజల ప్రాణాలు కోల్పోడానికి కారణం అవుతున్నారు. 

Tags:    

Similar News