Telangana: రాష్ట్రంలో మ‌రో ఏడు మెడికల్ కాలేజీలు

Telangana: తెలంగాణ మంత్రిమండ‌లి సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Update: 2021-05-30 15:24 GMT
KTR File photo

Telangana: తెలంగాణ మంత్రిమండ‌లి సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్త‌గా మ‌రో 7 మెడిక‌ల్ కాలేజీల ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రివ‌ర్గ స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు మంత్రి కేటీఆర్ వెల్ల‌డించారు. రాష్ట్రంలోని సంగారెడ్డి, నాగ‌ర్ క‌ర్నూల్‌, వ‌న‌ప‌ర్తి, మ‌హ‌బూబాబాద్‌, జ‌గిత్యాల‌, కొత్త‌గూడెం, మంచిర్యాల జిల్లాల్లో వీటిని అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు కేటీఆర్ ట్వీట్ ద్వారా తెలిపారు.

ఉమ్మ‌డి రాష్ట్రంలో తెలంగాణ‌కు కేవలం నాలుగు మెడిక‌ల్ కాలేజీలు ఉన్నాయ‌ని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఏర్పాడ్డాక కేసీఆర్ ప్ర‌భుత్వంలో 5 కళాశాల‌లు ఏర్పాటు చేసినట్లు వివ‌రించారు. మ‌రో ఏడు వైద్య‌ క‌ళాశాల‌లు అందుబాటులోకి రానున్నాయ‌ని ఆయ‌న తెలిపారు. కాగా.. 100 చొప్పున సీట్ల‌తో న‌ర్సింగ్ క‌ళాశాల‌లు మంజూర‌య్యాయి 13 న‌ర్సింగ్ క‌ళాశాల‌ల ఏర్పాటుకు కేబినెట్ నిర్ణ‌యం తీసుకుంది. తెలంగాణ‌ ప్రభుత్వం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు కూడా టీకా ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో పాటు జర్నలిస్టులు, వ్యాపారులకు టీకాలు ఇవ్వాలని స్ప‌ష్టం చేసింది. మార్గ ద‌ర్శ‌కాలు విడుద‌ల చేస్తామ‌ని కేటీఆర్ వెల్ల‌డించారు.



Tags:    

Similar News