శంషాబాద్ ఓఆర్‌ఆర్‌పై శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పనులు లేకపోవడంతో కర్ణాటకకు చెందిన 30 మంది కూలీలు స్వగ్రామం అయిన రాయచూర్‌కు బొలేరో ట్రక్‌లో బయలుదేరారు. ఔటర్ రింగు రోడ్డు మీది నుంచి వీరు వెళ్తుండగా రంగారెడ్డి జిల్లా పెద్ద గోల్కొండ సమీపంలో వెనక నుంచి వచ్చిన ఓ లారీ బొలేరోను బలంగా ఢీకొట్టింది.
ఈ ఘటనలో డ్రైవర్‌తో సహా ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొక మహిళ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని వీరందరిని హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా లాక్‌డౌన్ నేపథ్యంలో తెలంగాణవ్యాప్తంగా ఓటర్ మార్గాన్ని మూసి ఉంచిన నేపథ్యంలో వీరి వాహనానికి అనుమతి ఎలా లభించిదన్నది ప్రశ్నార్థకంగా మారింది.