Praja Bhavan: ప్రజాభవన్‌కు 2008 డీఎస్సీ బాధితులు.. తమను ఆదుకోవాలని 300 మంది బాధితుల ఆందోళన
Praja Bhavan: రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన డీఎస్సీ నిరుద్యోగులు
Praja Bhavan: తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని ప్రజాభవన్‌ను 2008 డీఎస్సీ బాధితులు ముట్టడించారు. తమకు న్యాయం చేయాలిన కోరుతూ.. రాష్టం నలుమూలల నుంచి 300 మంది పైగా డీఎస్సీ బాధితులు ప్రజాభవన్‌కు చేరుకున్నారు. తమకు ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని.. ఇదే విషయంపై గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా తమకు హామీ ఇచ్చారని బాధితులు గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన 3
నెలలలోపే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి జీవితాల్లో వెలుగు నింపిన కాంగ్రెస్ ప్రభుత్వం.. 2008 డీఎస్సీకి చెందిన వెయ్యి మంది బాధితుల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతున్నారు. తమ 15 ఏళ్ల కన్నీళ్లను తుడవాలని బాధితులు కోరుతున్నారు. ఏళ్లుగా నాన్చుతున్న తమ సమస్యపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.