Redmi 5G Smartphone: రెడ్‌మి సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్ రాబోతోంది.. స్టైలిష్ డిజైన్‌తో A1 ఫీచర్‌లను పొందండి..!

Redmi 5G Smartphone: త్వరలో భారతదేశంలో 5G సేవలు ప్రారంభంకానున్నాయి.

Update: 2022-08-31 10:57 GMT

Redmi 5G Smartphone: రెడ్‌మి సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్ రాబోతోంది.. స్టైలిష్ డిజైన్‌తో A1 ఫీచర్‌లను పొందండి..!

Redmi 5G Smartphone: త్వరలో భారతదేశంలో 5G సేవలు ప్రారంభంకానున్నాయి. ఈ పరిస్థితిలో చాలా మంది 5G నెట్‌వర్క్‌కు మద్దతు ఇచ్చే స్మార్ట్‌ఫోన్స్‌ కోసం చూస్తున్నారు. మీరు ఇలాంటి స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే రెడ్‌మి త్వరలో భారతదేశంలో Redmi 11 Prime 5G అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయబోతుంది. ఇది చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. దీని ఫీచర్లు చాలా బాగున్నాయి. ధర కూడా అందుబాటు ధరలోనే ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

Redmi 11 Prime 5G

ఈ స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 6, 2022న లాంచ్ అవుతుంది. ఈ ఫోన్‌ను ఈ ఏడాది ప్రారంభంలో రెడ్‌మి 11ఈ పేరుతో చైనాలో విడుదల చేశారు. రెడ్‌మీ ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజా లీక్‌లు, మీడియా నివేదికల ప్రకారం Redmi కొత్త 5G స్మార్ట్‌ఫోన్ Redmi 11 Prime 5Gని దాదాపు $ 200 (సుమారు 16 వేల రూపాయలు) ధరతో ప్రారంభించవచ్చు. ఈ ఫోన్ అనేక స్టోరేజ్ వేరియంట్లలో మార్కెట్లో లాంచ్ అవుతుంది.

Redmi 11 Prime 5G స్పెసిఫికేషన్‌లు

Redmi 11 Prime 5G 1080 x 2048 పిక్సెల్‌ల 6.58-అంగుళాల పూర్తి HD+ IPS LCD డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తోంది. ఈ ఫోన్ డైమెన్సిటీ 700 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పని చేయగలదు. దీనికి 6GB RAM, 128GB స్టోరేజ్‌ ఇస్తున్నారు. 5000mAh బ్యాటరీ, 18W వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్‌ ఉంటుంది. ఈ 5G స్మార్ట్‌ఫోన్‌కు 50MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, LED ఫ్లాష్ ఇవ్వవచ్చు. ఈ ఫోన్ Android 12 OS పై రన్ అవుతుంది. 5MP సెల్ఫీ కెమెరాను ఇందులో ఇవ్వొచ్చు.

Tags:    

Similar News