BSNL: రూ. 91తో రెండు నెలల వ్యాలిడిటీ.. అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్..!
BSNL Best Recharge Plan: ప్రముఖ ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దూసుకుపోతోంది.
BSNL: ప్రముఖ ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దూసుకుపోతోంది. దిగ్గజ ప్రైవేట్ కంపెనీలకు పోటీనిస్తూ అదిరిపోయే టారిఫ్‌లను ప్రకటిస్తోంది. జియో, ఎయిర్‌టెల్, వీఐలు టారిఫ్‌లను పెంచిన తర్వాత బీఎస్‌న్‌లకు భారీగా ఆదరణ పెరుగుతోన్న విషయం తెలిసిందే. ఓవైపు నెట్‌వర్క్ విస్తృతిని పెంచుతూనే మరోవైపు మంచి రీఛార్ల్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా యూజర్ల కోసం మరో అదిరిపోయే టారిఫ్‌ను ప్రకటించింది. కేవలం రూ. 91తో సుమారు 2 నెలల వ్యాలిడిటీతో ఈ ప్లాన్‌ను తీసుకొచ్చారు. ఈ ప్లాన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఎక్కువ రోజులు వ్యాలిడిటీ కోరుకునే వారికి ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. రూ. 91తో రీఛార్జ్ చేసుకుంటే 60 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇక ప్లాన్ బెనిఫిట్స్ విషయానికొస్తే.. ఈ రీఛార్జ్ చేసుకున్న వారికి ఇన్‌కమింగ్ ఉచితంగా లభిస్తుంది. అయితే అవుట్ గోయింగ్ కాల్స్‌కు నిమిషానికి 15 పైసలు పడుతుంది. అలాగే ఒక్కో ఎస్‌ఎమ్‌ఎస్‌కు 25 పైసలు పడుతుంది.
ఇన్‌కమింగ్ కాల్స్ కోసం ఉపయోగించే వారికి ఈ రీఛార్జ్ ప్లాన్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. అయితే ఈ రీఛార్జ్ ప్లాన్‌తో ఎలాంటి టాక్‌టైమ్ లభించదు. ఇందుకోసం యూజర్లు అదనంగా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ తక్కువ ప్లాన్‌తో సిమ్ ఎక్కువ కాలం యాక్టివేట్‌లో ఉండేందుకు ఈ ప్లాన్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇక సెకండరీ సిమ్‌గా ఉపయోగించే వారికి కూడా ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.