Tech Tips: మిస్ కాల్స్‌ను మిస్ అవుతున్నారా.? ఈ ఫీచర్‌తో సమస్యకు చెక్..!
Tech Tips: ఏదైనా ఇతర పనిలో బిజీగా ఉండి ఫోన్ లిఫ్ట్ చేయని సందర్భాలు ఉండనే ఉంటాయి.
Tech Tips: ఏదైనా ఇతర పనిలో బిజీగా ఉండి ఫోన్ లిఫ్ట్ చేయని సందర్భాలు ఉండనే ఉంటాయి. ఇలా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వెంటనే మిస్డ్ కాల్ రూపంలో పైన అలర్ట్ కనిపిస్తుంది. అలాగే డైల్డ్ లిస్ట్‌లో కూడా మిస్డ్ కాల్ వచ్చిన నెంబర్ రెడ్ కలర్‌లో హైలెట్ అవుతుంది. అయితే వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా యాప్స్ నోటిఫికేషన్స్ బిజీగా పడిపోయి మిస్డ్ కాల్ నోటిఫికేషన్‌ను విస్మరిస్తుంటాం.
అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఓ మంచి ఫీచర్ అందుబాటులో ఉందని మీకు తెలుసా.? ఇందుకోసం మీరు ఫోన్‌లో ట్రూ కాలర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్‌లో మిస్డ్ కాల్స్ రిమైండర్ ఫీచర్ సహాయంతో మీకు వచ్చిన మిస్డ్ కాల్స్ సమాచారం తెలుసుకోవచ్చు. ఇంతకీ ఈ ఫీచర్ ఎక్కడ ఉంటుంది? ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇందుకోసం ముందుగా మీ ఫోన్‌లోని ట్రూ కాలర్ యాప్‌ను ఓపెన్ చేయాలి. ఆ తర్వాత యాప్‌లో పైన కుడి వైపు కనిపించే త్రీ డాట్స్‌ను క్లిక్ చేసి సెట్టింగ్స్ ఆప్షన్‌లోకి వెళ్లాలి. అందులో కనిపించే కాల్స్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే.. రిమైండ్ మి ఆఫ్ మిస్డ్ కాల్స్ ఆప్షన్ కపిస్తుంది.
ఆ ఆప్షన్‌ను ఎంచుకున్న తరవాత దాని పక్కనే కనిపించే టోగుల్‌ను ఆన్ చేసుకోవాలి. దీంతో ఇకపై మీరు ఏదైనా కాల్ మిస్ అయితే మీకు అది రిమైండ్ చేస్తుంది. నోటిఫికేషన్ బార్‌లో ఓపెన్ చేసేంత వరకు ఆ అలర్ట్ కనిపిస్తూనే ఉంటుంది. ఇందుకోసం ట్రూకాలర్ యాప్ లేటెస్ట్ వెర్షన్‌ను ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈపాటికే మీ ఫోన్‌లో యాప్ డౌన్‌లోడ్ అయ్యి ఉంటే లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేసుకోవాలి.