Upcoming smartphone: మంచి స్మార్ట్ ఫోన్ కొనాలా? డిసెంబర్‌లో లాంచ్ కానున్న స్మార్ట్ ఫోన్లు ఇవే

Upcoming smartphone launches in December 2024: డిసెంబర్ 2024లో మనదేశంలో కొన్ని స్మార్ట్ ఫోన్లు విడుదల కానున్నాయి. వీటిలో ఐకూ 13 నుంచి వన్ ప్లస్ 13 వరకు చాలానే స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి.

Update: 2024-12-01 02:33 GMT

Upcoming smartphone: మంచి స్మార్ట్ ఫోన్ కొనాలా? డిసెంబర్‌లో లాంచ్ కానున్న స్మార్ట్ ఫోన్లు ఇవే

Upcoming smartphone launches in December 2024: మంచి స్మార్ట్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా. అయితే మీకో గుడ్ న్యూస్. డిసెంబర్ 2024లో మనదేశంలో కొన్ని స్మార్ట్ ఫోన్లు విడుదల కానున్నాయి. వీటిలో ఐకూ 13 నుంచి వన్ ప్లస్ 13 వరకు చాలానే స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి. వాటిపై ఓ లుక్కేయ్యండి.

నేటికాలంలో స్మార్ట్ ఫోన్ అనేది అత్యవసరం అయిపోయింది. ప్రతిఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. స్మార్ట్ ఫోన్ లేనిదే ఏ పనిచేయలేనంతగా స్మార్ట్ ఫోన్ల వాడకం ఉంది. దీన్ని పరిగణలోనికి తీసుకుంటున్న కంపెనీలు వినియోగదారులకు సరికొత్త స్మార్ట్ ఫోన్లను అందించాలన్న లక్ష్యంతో ప్రతిఏటా ప్రపంచవ్యాప్తంగా వందల సంఖ్యలో స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో లాంచ్ అవుతున్నాయి. మనదేశంలో కూడా ప్రతినెలా అనేక కొత్త కొత్త స్మార్ట్ ఫోన్స్ విడుదల అవుతున్నాయి. భారతీయ, వినియోగదారులు కూడా కొత్త ఫోన్స్ కోసం ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. స్మార్ట్ ఫోన్ కంపెనీలకు భారతదేశం అతిపెద్ద ఫోన్ మార్కెట్ గా నిలిచింది. ప్రతినెలా అనేక కొత్త ఫోన్స్ ఇక్కడ విడుదలవుతున్నాయి.

2024లో ఇప్పటికే శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 సిరీస్ నుంచి రియల్ మీ జీటీ 7 ప్రో వరకు అనేక కూల్ ఫోన్స్ భారత్ లో లాంచ్ అయ్యాయి. అయితే ఈ ఏడాది ఇంకా పూర్తవ్వలేదు. ఈ ఏడాది ముగియడానికి ఇంకా ఒక నెల సమయం మిగిలి ఉంది. 2024 చివరి నెలలో అంటే డిసెంబర్ లో చాలా కంపెనీలు తమ కొత్త స్మార్ట్ ఫోన్స్ ను భారత్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి. డిసెంబర్ నెలలో భారత మార్కెట్లోకి లాంచ్ కానున్న కొత్త టాప్ ఫోన్ల గురించి తెలుసుకుందాం.

iQOO 13 ప్రారంభ తేదీ - 3 డిసెంబర్ 2024

ధర - రూ. 55 వేలు

ఐకూ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ సపోర్ట్‌తో వస్తుంది. దీని AnTuTu స్కోర్ 3 మిలియన్లు. 6000mAh బ్యాటరీతో వస్తుంది. ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ ఫోన్ IP68, IP69 రేటింగ్‌లతో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ 6.82 అంగుళాల 2K+ 144Hz BOE Q10 LTPO AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఫోన్ 4500 నిట్స్ బ్రైట్‌నెస్, వేరియబుల్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వస్తుంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ మరింత ఆకట్టుకోనుంది. ఫోన్‌లో 50MP సోనీ IMX921 ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. అలాగే, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉంటుంది. ఇది కాకుండా, 50MP 3x టెలిఫోటో లెన్స్ సపోర్ట్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ 7 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్‌లతో వస్తుంది.

Vivo X200 సిరీస్ వచ్చే స్మార్ట్ ఫోన్ డిసెంబర్ లో ఎప్పుడైనా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ రూ. 90వేలు. Vivo X200 స్మార్ట్‌ఫోన్ MediaTek 9400 ప్రాసెసర్ సపోర్ట్‌తో వస్తుంది. ఫోన్‌లో 16GB LPDDR5X RAM, 512GB UFS 4.0 స్టోరేజ్ ఉంటుంది. Vivo X200 స్మార్ట్‌ఫోన్ 50MP Sony IMX882 టెలిమాక్రో 3x సెన్సార్‌తో వస్తుంది. అలాగే, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా 200MP Samsung HP9 టెలిమాక్రో సెన్సార్‌తో ఉంటుంది. అలాగే 32MP ఫ్రంట్ కెమెరా సపోర్ట్ కూడా ఉంటుంది.

OnePlus 13 స్మార్ట్‌ఫోన్‌ను డిసెంబర్ 2024లో లాంచ్ చేయవచ్చు. ఈఫోన్ ధర రూ. 50వేలు ఉండే అవకాశం ఉంది. ఫోన్ 6.82 అంగుళాల BOE X2 2K+ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. దీని గరిష్ట ప్రకాశం 4500 నిట్‌లుగా ఉంటుంది. ఫోన్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో రానుంది. అలాగే IP68, IP69 రేటింగ్ ఇవ్వగా.. ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ సపోర్ట్‌తో వస్తుంది. ఫోన్ 6000mAh బ్యాటరీ ఇందులో ఉంటుంది. అలాగే, 100W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందుబాటులో ఉంటుంది. OnePlus 13 ట్రిపుల్ రియర్ కెమెరా సెన్సార్‌తో వస్తుంది. ఫోన్ సోనీ LYT 808 ప్రైమరీ సెన్సార్, 50MP Sony LYT600 టెలిఫోటో లెన్స్, 50MP Samsung JN1 అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌తో వస్తుంది. ఫోన్ 32MP Sony IMX612 ఫ్రంట్ కెమెరా సెన్సార్‌తో వస్తుంది.

షియోమీ 15 స్మార్ట్ ఫోన్ డిసెంబర్ రెండవ వారంలో మార్కెట్లోకి రిలీజ్ కానుంది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్ ద్వారా రన్ అవుతుంది. ఇందులో కెమెరా ఫీచర్లు మరింత ఆకట్టుకోనున్నాయి. బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి రెడ్మీ నోట్ 14 సిరీస్ నుంచి స్మార్ట్ ఫోన్ రిలీజ్ కానుంది. డిసెంబర్ 9వ తేదీన ఇది మార్కెట్లోకి వస్తుంది.

రియల్ మీ 14 సిరీస్ నుంచి స్మార్ట్ ఫోన్ డిసెంబర్ రెండోవారంలో రిలీజ్ కాబోతోంది. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో ఇది వస్తుంది. మిడిల్ రేంజ్ కస్టమర్లకు ఆకట్టుకునే విధంగా ఈ ఫోన్ ఫీచర్లు ఉన్నాయి. ఇది బడ్జెట్ స్మార్ట్ ఫోన్. ఇక మోటో జీ 3కూడా డిసెంబర్ మొదటివారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది బడ్జెట్ విభాగంలో వస్తున్న స్మార్ట్ ఫోన్. మంచి కెమెరా, బ్యాటరీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అయితే ధర ఎంతో కంపెనీ ప్రకటించలేదు.

Tags:    

Similar News