Honor 200 5G Price: 'హానర్‌ 200 5జీ'పై 10 వేల తగ్గింపు.. బ్యాంక్, ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్స్ అదనం!

Update: 2024-12-02 16:16 GMT

Honor 200 5G Price and Features: ప్రస్తుతం ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ 'అమెజాన్‌'లో బ్లాక్ ఫ్రైడే సేల్ 2024 కొనసాగుతోంది. నవంబర్ 29న ఆరంభమైన ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై గొప్ప డీల్స్‌తో పాటు అనేక ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా 'హానర్‌ 200 5G' స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ అందుబాటులో ఉంది. ఏకంగా రూ.10,000 డిస్కౌంట్ ఆఫర్ ఇది. అంతేకాదు కూపన్స్, బ్యాంక్, ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్స్ అదనంగా ఉన్నాయి. దాంతో చాలా తక్కువ ధరకే హానర్‌ 200 5Gని ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి తెలుసుకుందాం.

హానర్‌ 200 5G స్మార్ట్‌ఫోన్ 8GB RAM + 256GB వేరియెంట్ ధర అమెజాన్ సైట్‌లో రూ.39,999గా ఉంది. బ్లాక్ ఫ్రైడే సేల్ 2024 సందర్భంగా ఈ ఫోన్‌పై 25 శాతం తగ్గింపు ఉంది. దాంతో కేవలం రూ.29,999 ధరకే మీ సొంతం అవుతుంది. అంటే మీరు రూ.10,000 ఆదా చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాదు... కంపెనీ మీకు రూ.3,000 తగ్గింపు కూపన్‌ను కూడా అందిస్తోంది. ఈ డిస్కౌంట్ కూపన్ తర్వాత ఫోన్ ధర రూ.26,999కి తగ్గుతుంది.

హానర్ 200 5Gపై అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. కొనుగోలుదారులు అదనంగా ఈ ఫోన్‌పై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. మీ పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్‌ ఇచ్చి రూ.27,550 తగ్గింపును పొందవచ్చు. అయితే ఈ ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ మీ పాత ఫోన్ కండిషన్ బట్టి ఉంటుంది. ఎలాంటి డామేజ్ లేకుండా.. కండిషన్ బాగుంటే పూర్తి ఎక్స్‌ఛేంజ్‌ వర్తిస్తుంది. అప్పుడు 2 వేల లోపే హానర్ 200 5Gని సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ను తెలుపు, నలుపు రంగులలో కొనుగోలు చేయవచ్చు.

హానర్‌ 200 5G స్పెసిఫికేషన్లు:

# 6.7 ఇంచెస్ అమోల్డ్ క్వాడ్‌ కర్వ్‌డ్‌ డిస్‌ప్లే

# 120Hz రీఫ్రెష్‌ రేటు, 4000 నిట్స్‌ బ్రైట్‌నెస్‌

# స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 3 ప్రాసెసర్‌

# అడ్రెనో 720 గ్రాఫిక్స్‌

# ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత మ్యాజిక్‌ ఓఎస్‌ 8.0

# 50MP సోనీ ఐఎంఎక్స్‌ 906 వైడ్‌, 50MP సోనీ ఐఎంఎక్స్‌ 856 టెలీఫొటో, 12MP అల్ట్రావైడ్‌ అండ్‌ మ్యాక్రో ట్రిపుల్‌ కెమెరా సెటప్‌

# 50MP సెల్ఫీ కెమెరా

# 5,200 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ (100W సూపర్‌ ఛార్జ్‌/ 66W వైర్‌లెస్‌ సూపర్‌ఛార్జ్‌ ప్రో సపోర్ట్‌)

# 5జీ, బ్లూటూత్‌ 5.3, వైఫై, ఓటీజీ, ఏజీపీఎస్‌, జీపీఎస్‌, యూఎస్‌బీ టైప్‌-సి వంటి కనెక్టివిటీ ఫీచర్లు.

Tags:    

Similar News