Black Friday Sale 2024: అమెజాన్‌లో 'బ్లాక్ ఫ్రైడే' సేల్.. 5జీ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్!
ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం 'అమెజాన్' ఎప్పటికప్పుడు కొత్త సేల్‌లతో కస్టమర్లను ఆకర్షిస్తోంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, గ్రేట్ సమ్మర్ సేల్, ఇయర్ ఎండ్ సెల్.. లాంటివి నిర్వహిస్తుంటుంది. తాజాగా మరో సేల్‌ను అమెజాన్ ప్రకటించింది. క్రిస్మస్ సందర్భంగా అమెరికాలో ఏటా నిర్వహించే 'బ్లాక్ ఫ్రైడే' సేల్‌ను నేడు ప్రారంభించింది. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు ఈ సేల్ కొనసాగనుంది. నాలుగు రోజుల పాటు కొనసాగే ఈ సేల్‌లో అమెజాన్ అద్భుత ఆఫర్స్ ప్రకటించింది.
బ్లాక్ ఫ్రైడే సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, వాషింగ్ మెషీన్స్, రిఫ్రిజిరేటర్స్, గృహోపకరణాలు సహా ఫ్యాషన్ ఉత్పత్తులపై అమెజాన్ భారీ ఆఫర్లు అందిస్తోంది. ముఖ్యంగా 5జీ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్స్ ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా 5జీ ఫోన్‌పై బంపర్ డిస్కౌంట్ ఉంది. ఈ ఫోన్ అసలు ధర రూ.1,24,999 కాగా.. ఆఫర్‌లో భాగంగా రూ.74,999కే మీ సొంతమవుతోంది. ఏకంగా 50 వేల తగ్గింపు ఉంది. యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, వన్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. దాంతో గెలాక్సీ ఎస్23 అల్ట్రా ధర మరింత తగ్గనుంది.
బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో యాపిల్, వన్‌ప్లస్, రియల్ మీ, ఐకూ, రెడ్‌మీ, టెక్నో, మోటోకు చెందిన స్మార్ట్‌ఫోన్‌లపై 40 శాతం డిస్కౌంట్‌ను అమెజాన్ అందిస్తోంది. యాపిల్ మ్యాక్ బుక్ ఎయిర్ ఎం1 ల్యాప్‌టాప్ ధర రూ.89,900గా ఉండగా.. సేల్ సమయంలో రూ.59,990 అందుబాటులో ఉంది. 30 వేలు మీరు ఆదా చేసుకోవచ్చు. అంతేకాదు దుస్తులపై 60 శాతం, గృహోపకరణాలపై 60-80 శాతం, ఎలట్రానిక్స్ వస్తువులపై 70 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. క్రిస్మస్ కోసం షాపింగ్ చేసేవారికి ఇదే మంచి సమయం. ఈ ఆఫర్స్ నాలుగు రోజులు మాత్రమే ఉండనున్నాయి.