Vivo T3 Lite 5G: ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. రూ.500కే 'వివో టీ3 లైట్‌ 5జీ'ని ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు!

Vivo T3 Lite 5G: ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) లో వివో టీ3 లైట్‌ (Vivo T3 Lite) పై రూ.4 వేల తగ్గింపు ఉంది. బ్యాంకు ఆఫర్స్ అదనంగా ఉన్నాయి.

Update: 2024-11-30 15:56 GMT

Vivo T3 Lite 5G: ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. రూ.500కే 'వివో టీ3 లైట్‌ 5జీ'ని ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు!

Vivo T3 Lite 5G: మీరు చౌకైన, సూపర్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా?.. అయితే ఇది మీ కోసమే. ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుత ఆఫర్ ఉంది. ఈ ఆఫర్లో మీకు తక్కువ ధరలో మంచి స్పెసిఫికేషన్స్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) లో వివో టీ3 లైట్‌ (Vivo T3 Lite) పై రూ.4 వేల తగ్గింపు ఉంది. బ్యాంకు ఆఫర్స్ అదనంగా ఉన్నాయి. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ సంవత్సరం జూన్‌లో వివో టీ3 లైట్‌ 5జీ భారత మార్కెట్లో లాంచ్ అయింది. లాంచ్ ఆఫర్లో భాగంగా 4 జీబీ ర్యామ్‌ + 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ను రూ.10,499కి.. 6 జీబీ ర్యామ్‌ + 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ను రూ.11,499కి తీసుకొచ్చింది. అనంతరం వీటి ధరలు పెరిగాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 6 జీబీ ర్యామ్‌ + 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ ధర రూ.15,499గా ఉంది. 25 శాతం తగ్గింపు అనంతరం రూ.11,499కి అందుబాటులో ఉంది. ఆక్సిస్ బ్యాంక్‌ క్రెడిట్ కార్డుపై రూ.1250 వరకు తగ్గింపు ఉంది. అప్పుడు రూ.10,249కి వివో టీ3 లైట్‌ మీ సొంతం అవుతుంది. అలానే ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ కూడా ఉంది. మీ పాత మొబైల్ కండిషన్ బాగుండి, ఎలాంటి డామేజ్ లేకుంటే.. రూ.10,950 ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ లభిస్తుంది. ఒకవేళ పూర్తి ఎక్స్‌ఛేంజ్‌ లభిస్తే.. వివో టీ3 లైట్‌ రూ.500కే మీరు ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు.

వివో టీ3 లైట్‌ 5జీలో 6.56 ఇంచెస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఇచ్చారు. 90 హెచ్‌జెడ్‌ రీఫ్రెష్‌ రేటు, 840 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఈ స్క్రీన్ సొంతం. ఇందులో ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఫన్‌టచ్‌ ఓఎస్‌ 14, మీడియాటెక్‌ డైమెన్సిటీ 6,300 ప్రాసెసర్‌ను ఇచ్చారు. ఫోన్ వెనకభాగంలో f/1.8 (50 MP), f/2.4 (2 MP) కెమెరా సెటప్‌ను ఇచ్చారు. సెల్ఫీ కోసం f/2.0 (8 MP) ఫ్రాంట్ కెమెరా ఉంటుంది. 15 వాట్స్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు. ఐపీ64 ప్రొటెక్షన్‌తో వచ్చింది.

కీ స్పెసిఫికేషన్స్:

# 6.56 ఇంచెస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే

# 90 హెచ్‌జెడ్‌ రీఫ్రెష్‌ రేటు

# 840 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌

# ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఫన్‌టచ్‌ ఓఎస్‌ 14

# మీడియాటెక్‌ డైమెన్సిటీ 6,300 ప్రాసెసర్‌

# 50 ఎంపీ బ్యాక్ కెమెరా

# 5,000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ

Tags:    

Similar News