CMF Phone 2 Pro: ఖతర్నాక్ ఫీచర్లతో CMF Phone 2 Pro.. లాంచ్ ఎప్పుడో తెలిసిందోచ్.. కీలక ఫీచర్లు లీక్..!

CMF Phone 2 Pro: నథింగ్ సబ్-బ్రాండ్ CMF ఈ సంవత్సరం తన అతిపెద్ద లాంచ్ ఈవెంట్‌ను ఏప్రిల్ 28న నిర్వహించబోతోంది.

Update: 2025-04-08 10:05 GMT
Nothing set to Launch CMF Phone 2 pro and CMF Buds 2 Series set April 28

CMF Phone 2 Pro: ఖతర్నాక్ ఫీచర్లతో CMF Phone 2 Pro.. లాంచ్ ఎప్పుడో తెలిసిందోచ్.. కీలక ఫీచర్లు లీక్..!

  • whatsapp icon

CMF Phone 2 Pro: నథింగ్ సబ్-బ్రాండ్ CMF ఈ సంవత్సరం తన అతిపెద్ద లాంచ్ ఈవెంట్‌ను ఏప్రిల్ 28న నిర్వహించబోతోంది. ఈ ఈవెంట్‌లో CMF స్మార్ట్‌ఫోన్ లైనప్‌లో తదుపరి ఫ్లాగ్‌షిప్ ఫోన్ అయిన CMF ఫోన్ 2 ప్రో, వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లను పరిచయం చేయనున్నట్లు కంపెనీ తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా ధృవీకరించింది. ఈసారి కెమెరా హార్డ్‌వేర్‌, డిజైన్ అప్‌గ్రేడ్‌ల ఉండొచ్చని వెల్లడించింది. కానీ కంపెనీ ఇంకా పూర్తి వివరాలను విడుదల చేయలేదు.

CMF ఫోన్ 2 ప్రో డిజైన్ కొంత ఆశ్చర్యకరంగా ఉంది, ఎందుకంటే కంపెనీ గత సంవత్సరం "ప్రో" మోడల్‌ను విడుదల చేయలేదు. జూలై 2024లో ప్రారంభించిన CMF ఫోన్ 1, ఇప్పటి వరకు ఉన్న ఏకైక CMF-బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్. "ప్రో" వేరియంట్ పరిచయం సాధారణ CMF ఫోన్ 2 ను కూడా తరువాత ప్రారంభించవచ్చని సూచిస్తుంది.

అయితే ఇప్పుడు అందుబాటులో ఉన్న లీక్స్ ప్రకారం.. CMF ఫోన్ 2 ప్రోలో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.77-అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే ఉండచ్చు. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్ ఉంటుంది. ఈ ఫోన్ నథింగ్ OS 3.1తో ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రన్ అవుతుంది.IP64 రేటింగ్‌తో వస్తుంది. బ్యాటరీ సామర్థ్యం 5,000mAh కావచ్చు, 50W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

కెమెరా సెటప్ విషయానికి వస్తే.. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంటుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. పైన చూపిన లీకైన రెండర్ కారణంగా ఈ ఫోన్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతోంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌తో పాటు, సీఎమ్ఎఫ్ మూడు కొత్త ఆడియో ప్రొడక్ట్స్ కూడా విడుదల చేస్తుంది. సీఎమ్ఎఫ్ బడ్స్ బడ్స్ 2, సీఎమ్ఎమ్ బడ్స్ 2a, సీఎమ్ఎఫ్ బడ్స్ 2 ప్లస్. ఈ కొత్త ఉత్పత్తులు సీఎమ్ఎఫ్ ప్రస్తుత TWS పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరిస్తాయి, ఇందులో ఇప్పటికే సీఎమ్ఎఫ్ బడ్స్ ప్రో 2 కూడా ఉంది.

Tags:    

Similar News