iQOO Z9s Pro Offer: అస్సలు మిస్ అవ్వొద్దు.. ఐక్యూ 5జీ ఫోన్ మొన్న లాంచ్.. ఇవాళ భారీ డిస్కౌంట్..!
iQOO Z9s Pro Offer: ఐక్యూ Z9s Pro స్మార్ట్‌ఫోన్‌పై రూ.3000 డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అమెజాన్, కంపెనీ అఫిషియల్ వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు.
iQOO Z9s Pro Offer: చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ ఐక్యూ ఇటీవలే దేశంలో తన తాజ స్మార్ట్‌ఫోన్ సిరీస్ నుంచి iQOO Z9sని విడుదల చేసింది. ఇందులో iQOO Z9s, Z9s Pro అనే రెండు మోడళ్లు ఉన్నాయి. Z9s మోడల్ ఆగస్టు 29న సేల్‌కు రానుంది. Z9s Pro మోడల్ ఇప్పటికే కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు ఈ మోడల్‌పై కంపెనీ భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. రూ. 3000 డిస్కౌంట్ పొందొచ్చు. మీరు కూడా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే ఆఫర్ ధర, ఫోన్ స్పెక్స్ గురించి తెలుసుకోండి.
iQOO Z9s Pro
ఐక్యూ Z9s Pro స్మార్ట్‌ఫోన్ 8GB+128GB వేరియంట్ ధర రూ. 24,999, 8GB+256GB వేరియంట్ రూ. 26,999, 12GB+256GB వేరియంట్ రూ. 28,999. ఈ ఫోన్లను అమోజాన్, ఐక్యూ అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. దీనిపై రూ. 100 తక్షణ తగ్గింపుతో సహా ప్రత్యేక ఆఫర్‌లతో అందుబాటులో ఉంది. ICICI బ్యాంక్, HDFC క్రెడిట్, డెబిట్, EMIలపై రూ. 3,000 తగ్గింపు లభిస్తుంది. అలానే అన్ని ఫోన్లపై రూ. 3,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉన్నాయి. ఈ ఆఫర్ Z9s Pro ధరను వరుసగా రూ. 21,999, రూ. 23,999, రూ. 25,999కి తీసుకువస్తుంది.
iQOO Z9s Features
ఐక్యూ Z9s Pro 2392 x 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.77-అంగుళాల ఫుల్ HD AMOLED డిస్‌ప్లే, 20:9 యాస్పెక్ట్ రేషియో, HDR10+ సపోర్ట్‌ని కలిగి ఉంది. స్క్రీన్ గరిష్టంగా 4500 నిట్స్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. పర్ఫామెన్స్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంటుంది.
ఇది Adreno 720 GPUతో Qualcomm Snapdragon 7 Gen 3 ప్రాసెసర్‌తో నడుస్తుంది. 8GB లేదా 12GB LPDDR4X RAM, 128GB లేదా 256GB UFS 2.2 స్టోరేజ్‌తో లభిస్తుంది. ఈ ఫోన్ Android 14 ఆధారిత FuntouchOS 14పై రన్ అవుతుంది. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5500mAh బ్యాటరీతో వస్తుంది. కనెక్టవిటీ కోసం 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, GPS, USB టైప్‌సి ఉన్నాయి.
కెమెరా ఫీచర్లలో సోనీ IMX 882 సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), f/1.79 ఎపర్చర్‌తో కూడిన 50MP మెయిన్ కెమెరాతో పాటు f/2.2 ఎపర్చరుతో 8MP అల్ట్రా వైడ్ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ కోసం, f/2.45 ఎపర్చర్‌తో 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఇతర ఫీచర్లలో ఇన్ డిస్‌ప్లై ఫింగర్ ప్రింట్ సెన్సార్, USB టైప్ సి, ఆడియో కోసం స్టీరియో స్పీకర్లు, IP64 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ ఉన్నాయి.