iPhone 16 Price Drop: ఆఫరంటే ఇట్లుండాలే.. ఐఫోన్ 16పై ఊహించని డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌తో అట్లుంటది మరి..!
iPhone 16 Price Drop: ఐఫోన్ 16 ధర మరోసారి భారీగా తగ్గింది. ఈ ఐఫోన్‌ను లాంచ్ ధర కంటే రూ. 10,000 తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా, ఫోన్ కొనుగోలుపై బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందిస్తున్నారు.

iPhone 16 Price Drop: ఆఫరంటే ఇట్లుండాలే.. ఐఫోన్ 16పై ఊహించని డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌తో అట్లుంటది మరి..!
iPhone 16 Price Drop: ఐఫోన్ 16 ధర మరోసారి భారీగా తగ్గింది. ఈ ఐఫోన్‌ను లాంచ్ ధర కంటే రూ. 10,000 తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా, ఫోన్ కొనుగోలుపై బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందిస్తున్నారు. ఈ ధర తగ్గింపు తర్వాత, ఈ యాపిల్ ఐఫోన్‌ను 2023లో ప్రారంభించిన ఐఫోన్ 15 ధరతో కొనుగోలు చేయచ్చు. ఈ ఐఫోన్‌ను ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో చాలా చౌకగా ఆర్డర్ చేయచ్చు. ఈ ఆఫర్ ఐఫోన్ 16 అన్ని వేరియంట్‌లపై అందుబాటులో ఉంది.
ఐఫోన్ 16 బేస్ 128జీబీ వేరియంట్ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 74,990. ఈ ఐఫోన్‌ను గతేడాది సెప్టెంబర్‌లో రూ.79,900 ప్రారంభ ధరతో విడుదల చేశారు. ఫోన్‌పై ప్రత్యేక ఆఫర్ కింద రూ.5,000 తగ్గించారు. ఇది కాకుండా, ఫోన్ కొనుగోలుపై రూ.4,500 బ్యాంక్ డిస్కౌంట్,రూ.2,500 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. ఈ విధంగా యాపిల్ ఈ ఐఫోన్‌ను రూ. 67,990 ధరతో కొనుగోలు చేయచ్చు. ఇది మాత్రమే కాదు, iPhone 16 కొనుగోలుపై రూ. 63,200 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంటుంది.
ఐఫోన్ 15 బేస్ 128GB వేరియంట్ ప్రారంభ ధర కూడా రూ.69,900. ఐఫోన్ 16 లాంచ్ తర్వాత, కంపెనీ ఈ పాత ఐఫోన్ మోడల్ ధరను రూ. 10,000 తగ్గించింది. ఈ ఐఫోన్ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో రూ. 64,400 ప్రారంభ ధరతో కొనుగోలు చేయచ్చు. ఇది కాకుండా, ఐఫోన్ 15 కొనుగోలుపై బ్యాంక్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ వంటి ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉంటాయి.
iPhone 16 Features
ఐఫోన్ 16 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే ఉంది, ఇది 60Hz, 800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ డిస్‌ప్లే డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఐఫోన్ A18 బయోనిక్ చిప్‌సెట్‌లో పని చేస్తుంది. ఐఫోన్ 16 వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంటుంది, ఇందులో 48MP మెయిన్, 12MP సెకండరీ కెమెరా ఉంటుంది.సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 12MP కెమెరా ఉంటుంది. ఈ ఐఫోన్ తాజా iOS 18లో పనిచేస్తుంది, దీనితో Apple ఇంటిలిజెన్స్ ఫీచర్ కూడా అందించారు. గతేడాది వచ్చిన ఈ ఐఫోన్‌లో కంపెనీ డెడికేటెడ్ క్యాప్చర్ బటన్‌ను ఇచ్చింది.