రిటైర్ అయిన యువరజ్ లో జోష్ తగ్గలేదు .. 22 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు
భారత క్రికెట్ జట్టుకు మాజీ అల్ రౌండర్ యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే..ప్రస్తుతం యువరాజ్ సింగ్ గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో ఆడుతున్నాడు . అందులో యువరాజ్ టోరంటో నేషనల్స్ టీంకి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే బ్రాంప్టన్, టోరంటో టీమ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ ఏకంగా 22 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేశాడు. కానీ యువీ టీమ్ 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. మొదటగా బ్యాటింగ్ చేసిన బ్రాంప్టన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకి టోరంటో టీం ఏడూ వికెట్ల నష్టానికి 211 పరగులు మాత్రమే చేసింది . అయితే ఈ మ్యాచ్ లో యువరాజ్ బాదిన సిక్సర్లే హైలైట్ గా నిలిచాయి
What an entertainer!@YUVSTRONG12 hammered the bowling attack in his innings of 51(22).
— GT20 Canada (@GT20Canada) August 4, 2019
The Southpaw hit five big sixes.#GT2019 #BWvsTN @TorontoNational @BramptonWolves pic.twitter.com/Ts5C9FQfk0