భారత క్రికెటర్, సిక్సర్ల వీరుడు యువరాజ్‌సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సోమవారం ముంబయిలో మీడియా సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని ప్రకటించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నాడు. దాదాపు 17 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని, జీవితంలో ఏ విధంగా పోరాడాలో ఆటనే నేర్పిందని యువరాజ్ భావోద్వేగానికి గురయ్యాడు. క్రికెట్ తనకు ఎంతో ఇచ్చిందన్న యూవీ చిన్నప్పటి నుంచి ప్రాణంగా ప్రేమించిన ఆటకు దూరం అవుతుండటం ఎంతో బాధగా ఉందని తెలిపాడు. ఇన్ని రోజులుగా తనను ఆదరించిన అభిమానులకు తన వెన్నంటి నిలిచిన కుటుంబ సభ్యులు, కోచ్, శ్రేయోభిలాషులకు ప్రత్యేక ధన్యవాదాలంటూ పేర్కొన్నాడు. 2011 ప్రపంచకప్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన యువీ కప్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. 2007 టీ20 ప్రపంచకప్ విజయంలోనూ యువరాజ్ తన పాత్ర పోషించాడు. 2012లో చివరిగా టెస్టు మ్యాచ్ ఆడిన యువీ 2017లో ఆఖరి వన్డే, టీ20 ఆడాడు.