ధోని, కోహ్లీపై యువరాజ్ సింగ్ తండ్రి సంచలన ఆరోపణలు

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనిపై మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.

Update: 2020-05-06 08:21 GMT
MS Dhoni, Yuvraj Singh, Virat Kohli (File Photo)

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనిపై మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. యువరాజ్ సింగ్ క్రికెట్ భవిష్యత్ను ధోని నాశనం చేశారని ఆరోపించారు. యువరాజ్ క్రికెట్ కెరీర్ ఇబ్బందుల్లో పడటానికి కోహ్లీ భాగం కూడా ఉందని ఆయన అన్నారు. మీరిద్దరూ యువీకి మద్దతుగా నిలవలేదని యోగ్ రాజ్ ఆరోపించారు. ధోని, కోహ్లీతో పాటు సెలెక్టర్లు కూడా యువరాజ్‌కు మద్దతు ఇవ్వలేదు. యువీ ఫామ్‌లోకి వస్తే జట్టులోకి ఎలా తీసుకోవాలి? అనే ఆందోళన అందరిలోనూ కనిపించేదని, చాలామంది యువీకి వెన్నుపోటు పొడిచారు' అని యోగ్‌రాజ్‌ కామెంట్ చేశాడు.

గతంలో కూడా యువీ కెరీర్‌ను ధోని దెబ్బ తీశాడని యొగ్ రాజ్ ఆరోపించాడు. యువీని వివరణ కోరగా అవి తన తండ్రి వ్యక్తిగత వ్యాఖ్యలు అని, దానిపై మాట్లాడబోనని అన్నాడు. టీమిండియా వన్డే ప్రపంచ కప్ సాధించడంలో యువీ కీలక పాత్ర పోషించాడు. ప్రపంచ కప్ అనంతరం క్యాన్సర్ బారిన నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి రావడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. ఎలాగోలా పామ్ సాధించి జట్టు లో అడుగుపెట్టాడు యువీ.. మరింతకాలం జట్టులో నిలదొక్కుకోలేక పోయాడు.


Tags:    

Similar News