World Cup 2023: ఐసీసీ వరల్డ్ కప్ కు సర్వం సిద్ధం.. భారత్-పాక్ పోరు ఏ స్టేడియంలో అంటే...?
World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీ షెడ్యూల్ ఖారారు అయింది.
World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీ షెడ్యూల్ ఖారారు అయింది. భారత్ వేదికగా అక్టోబర్ లో జరిగే ఈ క్రికెట్ మహాసంగ్రామానికి సంబంధించిన షెడ్యూల్ ని ఐపీఎల్ 2023 సీజన్ ముగియగానే బీసీసీఐ అనౌన్స్ చేయనుంది. అక్టోబర్ 5న టోర్నీ ఆరంభం అవుతుంది. నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. వన్ డే ప్రపంచ కప్ టోర్నమెంట్ లో 46 రోజుల వ్యవధిలో మూడు నాకౌట్ లతో సహా మొత్తం 48 మ్యాచ్ లు జరగనున్నాయి.
ఇక టోర్నీకే హైలైట్ గా నిలిచే భారత్ పాక్ పోరును అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో అక్టోబర్ 7న నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీ కోసం అహ్మదాబాద్ తో పాటు బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ధర్మశాల, గువహతి, హైదరాబాద్, కోల్ కతా, ఇండోర్, రాజ్ కోట్, ముంబై లోని స్టేడియంలను బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసింది. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ తమ మ్యాచ్ లను కోల్ కతా, చెన్నైలో ఆడేందుకు మొగ్గుచూపుతోంది. బంగ్లాదేశ్ తమ మ్యాచ్ లను కోల్ కతా, గువహతి వేదికగా ఆడేందుకు ఇష్టపడుతోంది.
వర్డల్ కప్ మెగా టోర్నీకి టీమిండియా, ఆస్ట్రేలియాతో సహా తొమ్మిది జట్లు క్వాలిఫై అయ్యాయి. వరల్డ్ కప్ కోసం బీసీసీఐ ఇప్పటికే 20మంది ఆటగాళ్లను షార్ట్ లిస్ట్ చేసింది. వీరిలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, షమీ, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్ ఉన్నారు. ఇక, 2011లో స్వదేశంలో విశ్వవిజేతగా నిలిచిన భారత్ ఈసారి కప్పు కొట్టాలనే పట్టుదలతో ఉంది. మరి, మన సొంతగడ్డపై రోహిత్ సేన ట్రోఫీ నెగ్గుతుందా...మూడోసారి విశ్వ విజేతగా నిలుస్తుందా అనేది చూడాలి.