AUS vs SA: ఆస్ట్రేలియా ఆలౌట్‌.. కంగారులను చిత్తుగా ఓడించిన సౌతాఫ్రికా

AUS vs SA: పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండోస్థానానికి పడిపోయిన ఆసీస్‌

Update: 2023-10-13 02:45 GMT

AUS vs SA: ఆస్ట్రేలియా ఆలౌట్‌.. కంగారులను చిత్తుగా ఓడించిన సౌతాఫ్రికా

AUS vs SA: ఐదుసార్లు వరల్డ్‌కప్‌ ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియా.. కీలకమైన ఈ మెగాటోర్నీలో వరుసగా రెండో ఓటమి చవిచూసింది. మొదటి మ్యాచ్‌లో భారత్‌తో ఓడిన ఆసీస్... రెండో మ్యాచ్‌లోనూ దక్షిణాఫ్రికా చేతిలో ఓటమిపాలైంది. భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైంది. ఆరంభం నుంచే బ్యాట్స్‌మెన్‌ తడబడటంతో పరాజయాన్ని చవిచూసింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన సౌతాఫ్రికా కంగారూ టీమ్‌ను చిత్తు చేసింది.

తొలి ఇన్నింగ్స్‌ ఆడిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో 311 పరుగులు చేసింది. డికాక్‌ సెంచరీ చేయగా.. మార్‌క్రమ్‌ హాఫ్ సెంచరీతో రాణించాడు. దీంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి దక్షిణాఫ్రికా 311 పరుగులు చేసింది. స్టార్క్, మాక్స్‌వెల్‌ చెరో రెండు వికెట్లు తీశారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఆరంభం నుంచే తడబడింది. 27 పరుగులకే ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన స్మిత్, ఇంగ్లిస్ కూడా తక్కువ పరుగుల వ్యవధిలోనే ఔటయ్యారు. దీంతో కష్టాల్లో పడిన ఆసీస్‌ను ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌ నిలబెట్టలేకపోయారు. దీంతో 177 పరుగులకే ఆలౌట్ అయింది ఆసీస్. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడ 3 వికెట్లు తీయగా.. జాన్సన్, శంషీ, మహరాజ్‌కు తలో రెండు వికెట్లు పడ్డాయి.

ఆడిన రెండు మ్యాచుల్లోనూ పేలవ ప్రదర్శన చేసిన ఆసీస్‌ చెత్త రికార్డులను మూటగట్టుకుంది. వరల్డ్‌కప్‌ పాయింట్ల పట్టికలో కింద నుంచి రెండోస్థానానికి పడిపోయింది. వరుసగా వరల్డ్‌కప్‌లో నాలుగు మ్యాచులు ఓడిపోవడం కూడా ఆస్ట్రేలియాకు తొలిసారి. వరల్డ్‌కప్‌ చరిత్రలో ఇంతటి భారీ తేడాతో ఓటమి పాలవడం కూడా మొదటిసారి. 70 పరుగులలోపు ఏనాడూ సగం వికెట్లు కోల్పోయిన చరిత్ర లేని ఆసీస్ టీమ్.. నిన్నటి మ్యాచ్‌లో ఆ చెత్త రికార్డును కూడా మూటగట్టుకుంది.

Tags:    

Similar News