దక్షిణాఫ్రికా వేదికగా మహిళల అండర్-19 టీ 20 వరల్డ్ కప్
* అమెరికా అండర్-19 జట్టులో తెలుగమ్మాయిల హవా.. హర్షం వ్యక్తం చేస్తున్న తెలుగు సమాజం
ICC Under 19 Women: దక్షిణాఫ్రికా వేదికగా వచ్చే నెలలో మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్ మొదలుకానుంది. అమెరికా క్రికెట్ బోర్డ్ 15 మంది స్క్వాడ్‌తో కూడిన అండర్-19 జట్టును తాజాగా ప్రకటించింది. అమెరికా అండర్-19 మహిళల జట్టుకు తెలుగు మూలాలున్న అమ్మాయిలే ఎక్కువగా ఎంపిక కావడం విశేషం. గీతికా కొడాలి అనే తెలుగు సంతతికి చెందిన అమ్మాయి అమెరికా అండర్-19 మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనుంది. అంతేకాదు అమెరికా క్రికెట్ బోర్డ్ జట్టులో ఎంపిక చేసిన భూమిక భద్రిరాజు, లాస్య ముళ్లపూడి, సాయి తన్మయి ఇయ్యుని, కస్తూరి వేదాంతం వీళ్లంతా తెలుగు సంతతికి చెందిన అమ్మాయిలే కావడం విశేషం.
అమెరికా అండర్-19 మహిళల క్రికెట్ జట్టుకు ఒక తెలుగు సంతతి అమ్మాయికి, కెప్టెన్సీ చేసే అవకాశం రావడం పట్ల అమెరికాలోని తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. తెలుగు సంతతి అమ్మాయిలు అమెరికా క్రికెట్ టీంలో భాగం కావడం తెలుగు జాతికే గర్వ కారణమని అక్కడి తెలుగు సమాజం హర్షం వ్యక్తం చేసింది. తొలిసారి జరుగుతున్న అండర్-19 ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్‌లో భాగమవుతున్న అమెరికా అండర్-19 మహిళా క్రికెట్ జట్టులో భాగమయ్యే అవకాశం మన తెలుగు అమ్మాయిలకు దక్కడం మరో విశేషం.