IPL Auction 2025: ఐపీఎల్‌ వేలంలో ఫస్ట్ టైం ఇటలీ ఆటగాడు.. ఇంతకీ ఎవరంటే..?

ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం ఇటలీకి చెందిన థామస్ జాక్ డ్రాకా స్వయంగా నమోదు చేసుకున్నాడు. వాస్తవానికి ఇటలీలో ఫుట్‌బాల్ బాగా ప్రాచుర్యం పొందింది.

Update: 2024-11-07 06:09 GMT

IPL Auction 2025: ఐపీఎల్‌ వేలంలో ఫస్ట్ టైం ఇటలీ ఆటగాడు.. ఇంతకీ ఎవరంటే..?

IPL Auction 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా వేలం సౌదీ అరేబియాలోని జెడ్డాలో నవంబర్ 24, 25 తేదీల్లో జరగనుంది. ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం 1574 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో 320 క్యాప్డ్, 1,224 అన్‌క్యాప్డ్, 30 అసోసియేట్ దేశాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ప్రకటించింది. ఈ జాబితాలో మొదటి సారి ఇటలీకి చెందిన ఆటగాడు కూడా చేరాడు.

ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం ఇటలీకి చెందిన థామస్ జాక్ డ్రాకా స్వయంగా నమోదు చేసుకున్నాడు. వాస్తవానికి ఇటలీలో ఫుట్‌బాల్ బాగా ప్రాచుర్యం పొందింది. ఈ ఫుట్‌బాల్ క్రేజీ దేశానికి చెందిన క్రికెట్ ఆటగాడు మొదటిసారిగా వార్తల్లో నిలిచాడు. మెగా వేలంలో తొలిసారిగా ఇటలీ ఆటగాడు భాగం కాబోతున్నాడు. తాజాగా, ఆస్ట్రేలియా ఆటగాడు జో బర్న్స్ ఇటలీ జాతీయ క్రికెట్‌లో చోటు సంపాదించాడు. టీ20లో ఇటలీ జట్టు మెరుగైన ప్రదర్శన చేస్తోంది.

థామస్ జాక్ డ్రాకా ఎవరు?

రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ థామస్ జాక్ డ్రేకా ఈ ఏడాది జూన్ 9న లక్సెంబర్గ్‌తో ఇటలీ తరపున తన మొదటి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. నాలుగు T-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో అతని పేరు మీద 8 వికెట్లు ఉన్నాయి. ఐపీఎల్ వేలం కోసం ఇటాలియన్ ఆటగాడు నమోదు చేసుకోవడం ఇదే మొదటిసారి అయినప్పటికీ, అతను కెనడా టీ20 లీగ్‌లో బ్రాంప్టన్ వోల్వ్స్‌తో పాటు ఐఎల్టీ 20లో ముంబై ఇండియన్స్ యాజమాన్యంలోని ఎంఐ ఎమిరేట్స్ జట్టు తరుఫున ఆడారు.

మీడియం పేస్ బౌలర్ థామస్ డ్రేకా ఆగస్టు 2024లో జరిగిన గ్లోబల్ టీ20 కెనడాలో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అతను ఆరు ఇన్నింగ్స్‌లలో 10.63 సగటుతో, 6.88 ఎకానమీతో 11 వికెట్లు తీశాడు. 30 లక్షల బేస్ ప్రైస్‌తో ఆల్‌రౌండర్ విభాగంలో డ్రాకా నమోదు చేసుకుంది. 10 ఫ్రాంచైజీలు వేలం సమయంలో 204 మంది ఆటగాళ్లపై ఖర్చు చేయడానికి సుమారు రూ. 641.5 కోట్లు కలిగి ఉంటాయి. మొత్తం 204 స్లాట్‌లు భర్తీ చేయబడతాయి. వీటిలో 70 విదేశీ ఆటగాళ్లకు కేటాయించబడ్డాయి. ఇప్పటివరకు, 10 ఫ్రాంచైజీలు రూ. 558.5 కోట్లతో 46 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాయి.


Tags:    

Similar News