వరల్డ్ కప్ టోర్నీలో ఈరోజు పదో మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో వెస్టిండీస్ తలపడుతోంది. ఆచి తూచి ఛేదన మొదలు పెట్టిన వెస్టిండీస్ కష్టాల్లో పడింది. కీలక వికెట్లు కోల్పోయి.. పరుగుల కోసం ప్రయత్నిస్తోంది. మొదటి ఓవర్లలో ఆసీస్ బౌలింగ్ను ఎదుర్కోవడానికి తిప్పలు పడ్డా తరువాత నిదానంగా స్కోరు చేసుకుంటూ వెళ్లారు విండీస్ ఆటగాళ్లు. అయితే, 25 ఓవర్లకు 133 పరుగులు సాధించి మూడు వికెట్లు కోల్పోయిన విండీస్ తరువాత 27 వ ఓవర్లో నాలుగో వికెట్ చేజార్చుకుంది. హెట్‌మైయిర్ (21; 28 బంతుల్లో ) రనౌట్ అయ్యాడు. 27.2వ బంతిని హోప్ ఆడాడు. పరుగుకు ప్రయత్నించాడు. బంతి ఫీల్డర్‌కు దొరకడంతో హెట్‌మైయిర్‌ను వారించాడు. అప్పటికే అతడు సగం దూరం వచ్చేశాడు. దీంతో నిరాశగా వెనుతిరిగాడు హెట్‌మైయిర్. తరువాత వచ్చిన హోల్డెర్ తో కల్సి తన ఇన్నింగ్స్ ను నిదానంగా కదిలించాడు హోప్స్. 35 ఓవర్ చివరి బంతికి హోప్స్ పోరాటం ముగిసింది. రంభం నుంచి ఆసీస్ బౌలింగ్‌ను ధాటిగా ఎదుర్కొంటూ చక్కటి ఇన్నింగ్స్ ఆడిన ఈ కుడి చేతివాటం బ్యాట్స్‌మెన్ 35ఓవర్ చివరి బంతికి కమిన్స్ బౌలింగ్‌లో ఖవాజా చేతికి చిక్కాడు. హాప్ 104 బంతుల్లో 68 పరుగులు చేశాడు. ఈదశలో హోల్డర్ కు రస్సెల్ జత కలిశాడు. ధాటిగా బ్యాట్ ఝుళిపించాడు. కానీ, భారీ షాట్‌కు ప్రయత్నించిన రసెల్(15; 11బంతుల్లో) 39ఓవర్‌లో ఐదో బంతికి మ్యాక్స్‌వెల్ చేతికి చిక్కాడు. అటు తరువాత బ్రాత్‌వైట్ హోల్డర్ కు సహాయంగా నిలబడ్డాడు. దీంతో హోల్డర్ 50 బంతుల్లో తన అర్థ సెంచరీని పూర్తి చేశాడు. మరోవైపు బ్రాత్‌వైట్ కూడా ధాటిగా ఆడుతున్నాడు. 45 ఓవర్లు ముగిసే సరికి విండీస్ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 255 పరుగులు చేసింది. హోల్డర్ 51 పరుగులతోనూ, బ్రాత్‌వైట్ 16 పరుగులతోనూ క్రీజ్ లో ఉన్నారు. ఇంకా విండీస్ విజయానికి 30 బంతుల్లో 38 పరుగులు చేయాలి. చేతిలో నాలుగు వికెట్లున్నాయి.