టీమిండియా బౌలర్ల ఆధిపత్యం : విండీస్ 95 పరుగులు

Update: 2019-08-03 16:11 GMT

టీమిండియా బౌలర్లు పూర్తిగా మ్యాచ్ ను తమ చేతిలోకి తీసుకున్నారు. వెస్టిండీస్ టూర్ లో భాగంగా ఈరోజు తోలి టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది భారత్. ఆ నిర్ణయం సరైనదే అని నిరూపించారు టీమిండియా బౌలర్లు. వరుసగా వికెట్లు తీసి విండీస్ బ్యాట్స్ మెన్ ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. వారికి కుదురుకోవడానికి అవకాశం ఇవ్వకుండానే 20 ఓవర్లూ బౌలింగ్ చేశారు. దాంతో మొత్తమ్మీద ఇన్నింగ్స్ ముగిసేసరికి విండీస్ 9 వికెట్లకు 95 పరుగులు మాత్రమె చేయగలిగింది. ఇప్పుడు భారత్ విజయ లక్ష్యం 96 పరుగులు.

 

Tags:    

Similar News