నిలకడగా ఆడుతున్న వెస్టిండీస్

Update: 2019-06-17 11:04 GMT

వరల్డ్ కప్ టోర్నీ లో ఈరోజు బాంగ్లాదేశ్ తో తలపడుతోంది వెస్టిండీస్. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ మొదలు పెట్టిన ఆ జట్టు తొలి ఓవర్లలోనే గేల్ వికెట్ కోల్పోయింది. అటు తరువాత విండీస్ బ్యాట్స్ మెన్ జాగ్రత్తగా ఆడుతున్నారు. 20 ఓవర్లు ముగిసే సరికి విండీస్ ఒక్క వికెట్ నష్టానికి 86 పరుగులు చేసి  పటిష్ట స్థితి లో నిలిచింది. లూయిస్ 52 బంతుల్లో 45 పరుగులు చేసి అర్థశతకం వైపు పరుగులు తీస్తున్నాడు. హోప్ 55 బంతుల్లో 33 పరుగులు చేసి అతనికి అండగా ఉన్నాడు. 

Tags:    

Similar News