అత్యాశే కనీ.. ప్రయత్నిస్తాం! బంగ్లాదేశ్ కెప్టెన్ మోర్తజా

Update: 2019-07-02 04:09 GMT

వరల్డ్ కప్ లో టీమిండియా చాలా గట్టి టీం. ఆ జట్టుతో తలపడటం కష్టమే. కానీ వంద శాతం పోరాటం చేస్తాం.. అంటున్నాడు బంగ్లాదేశ్ కెప్టెన్ మోర్తజా. ఈరోజు టీమిండియా తో బంగ్లాదేశ్ తలపడనుంది. ఈ సందర్భంగా మోర్తజా విలేకరులతో మాట్లాడారు. ప్రపంచ కప్ లో మేం ఉంటామా లేదా అన్నది ఇక్కడ ముఖ్యం కాదు. ప్రస్తుతం మా ముందున్న సవాల్ ఈరోజు మ్యాచ్ ఎలా గెలవాలనేదే. ఇప్పటివరకూ ఆడిన దానికన్నా బాగా ఆడాల్సి ఉంది. మా జట్టులో ప్రపంచ శ్రేణి ఆల్రౌండర్ షకిబ్ అల్ హసన్ ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఇదే ప్రదర్శన ఆటను చేస్తాడు. కాబట్టి మంచి ఫలితాలు వస్తాయి అని బంగ్లా కెప్టెన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.  

Tags:    

Similar News