అన్నిదారులూ మూసుకుపోయాయి. పరువు దక్కించుకునే మార్గం ఒక్కటే. బంగ్లాదేశ్ పై మంచి విజయం సాధించడం. కనీసం విజయంతో తమ ప్రపంచకప్ ప్రస్థానాన్ని ముగించిన పేరన్నా దక్కించుకోవచ్చు. అయితే, పాకిస్థాన్ అద్భుతం చేస్తామంతోంది. ఆ టీం కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కొద్దిసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై 500 పరుగులు సాదిస్తామంటూ చెబుతున్నాడు.
ఎందుకో తెలుసా.. ఇపుడు అద్భుతం జరగాలి. పాకిస్తాన్ బంగ్లాదేశ్ ను చిత్తుగా ఓడించాలి. మొదట బ్యాటింగ్ చేసి కనీసం 316 పరుగుల తేడాతో ఓడించాలి. అప్పుడే పాయింట్ల పట్టికలో నాలుగో స్థానం దక్కుతుంది. ఒకవేళ బంగ్లా గనుక మొదట బ్యాటింగ్ చేస్తే ఆ జట్టు ఎన్ని పరుగులు చేయాలో.. అది సాధ్యం అయ్యే పని కాదు. అందుకే మేం మొదట బ్యాటింగ్ చేసి 500 పరుగులు చేస్తాం. తరువాత బంగ్లా జట్టును 50 పరుగులకే ఆలౌట్ చేయడానికి కృషి చేస్తామని చెబుతున్నాడు.
ఇదంతా వింటుంటే.. మీకు మన కేఏ పాల్ గుర్తొస్తే మేమేమీ చేయలేం. సర్ఫరాజ్ చెప్పాడంటే ఇక తిరుగు ఉండదు.