హార్దిక్ పాండ్య నిశ్చితార్థంపై తండ్రి సంచలన వ్యాఖ్యలు
భారత క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య నిశ్చితార్థం చేసుకున్నాడు.
భారత క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య నిశ్చితార్థం చేసుకున్నాడు. గత కొంతకాలంగా సెర్బియా మోడల్ నటాషా స్టాన్‌తో రిలేషన్‌పిప్‌లో ఉన్నాడు. వీరిద్దరి మధ్య సంబంధంపై తాజాగా హార్దిక్ పాండ్యా స్పందించాడు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని తన ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతాలో పాండ్యా ఒక పోస్టు పెట్టాడు. అందులో నటాషాతో తాను దిగిన ఫొటోను షేర్ చేస్తూ హెచ్ పీ లవ్స్ నాట్స్ అని రాసిన కేక్‌ను కట్ చేశారు. ఇద్దరం నిశ్చితార్థం చేసుకున్నామని అభిమానులకు షేర్ చేశారు.
పాండ్యా తల్లిదండ్రులు షాక్ గురైయ్యారు. దీనిపై పాండ్యా తండ్రి హిమాన్షు పాండ్యా మీడియాతో పలు విషయాలు చెప్పారు. పాండ్యా, నటాషా ప్రేమలో ఉన్నారని తెలుసు. కానీ, వారి నిశ్చితార్థం గురించి మాకు తెలియదు. నిశ్చితార్థం జరిగిన తర్వాత మాకు పూర్తి విషయం తెలిసింది. కొత్త సంవత్సరం వేడుకల కోసం దుబాయ్ వెళ్తున్నారన్న సమాచారం ఇచ్చారు. ఇక నటాషా గురించి చెప్పాలంటే ఆమె మంచి అమ్మాయి. నటాషా తల్లిదండ్రులతో మాకు మంచి పరిచయం ఉంది. పాండ్యా, నటాషా నిశ్చితార్థం చేసుకున్న విషయం తర్వాత తెలిసింది. వారిద్దరి పెళ్లి ఎప్పుడు విషయం ఇంకా చర్చించ లేదు. ఎప్పుడు చేయాలో నిర్ణయించుకుంటామని హిమాన్షు పాండ్యా తెలిపారు.
భారత క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య, సెర్బియా మోడల్ నటాషా పేమలో ఉన్న సంగతి తెలిసిందే. దుబాయ్ వెళ్లిన వీరు సంముద్రంలోని ఓహ్యాచ్ లో ప్రయాణిస్తూ తన ప్రియురాలు నటాషాకి ఉగరం తొడిగాడు. ఇన్ స్టాలో మైతేరా, తు మేరి జాన్, సారా హిందుస్థాన్ .. #ఎంగేజ్‌డ్ అని పాండ్య పోస్ట్ జత చేశాడు. నటాషా కూడా పాండ్యకు ఉంగరం తొడిగింది. వీరి జంటను భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ సారథి ధోని సతీమణి సాక్షిధోని, జాడేజా, సోనాల్ చౌహన్, శ్రేయస్ అయ్యార్, కుల్ దీప్ యాదవ్ పలువురు అభినందనలు తెలిపారు.
గురించి హార్దిక్ పాండ్యా చేసిన మొదటి కామెంట్ ఇది కావడం విశేషం. నిజానికి గత కొంతకాలంగా వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని వార్తలు నెట్‌లో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. గత ఏడాది మేలో నటాషాను తన ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు కూడా పాండ్యా పరిచయం చేశాడు. ప్రస్తుతం ముంబైలో నివాసముంటున్న నటాషా తొలుత బాలీవుడ్‌లోకి ఐటమ్ గర్ల్‌గా అడుగుపెట్టింది. ఇటీవల షారుక్ ఖాన్, అనుష్క నటించిన జీరో అనే సినిమాలో ఓ కీలకపాత్రలో నటించింది. బిగ్ బాస్ హీందీలో 8వ సీజన్ లో ఆమె చేసింది.