అదృష్టం అంటే ఇదే. భారీ లక్ష్యాన్ని సాధించడానికి బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఓపెనర్లను భారత బౌలింగ్ ద్వయం మొదట్లోనే కట్టడి చేసింది. మొదటి ఓవర్లో భువనేశ్వర్ మూడు పరుగులే ఇచ్చాడు. తరువాతి ఓవర్ వేసిన బుమ్రా తొలి బంతికే వార్నర్ వికెట్ తీసేవాడే. అయితే, ఆ బంతి వార్నర్ బ్యాట్‌కు తగిలి నేరుగా వికెట్లను తాకింది కానీ బెల్స్ పడకపోవడంతో బతికిపోయాడు.
భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. భారత బౌలర్లను అడ్డుకుంటున్నారు. భువనేశ్వర్ పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. మరో ఎండ్ లో బుమ్రా బౌలింగ్ లో ఆసీస్ ఆటగాళ్ళు షాట్లు కొడుతున్నారు. ఐదు ఓవర్లు పూర్తయే టప్పటికి ఆసీస్ 18 పరుగులు చేసింది. వార్నర్ 8 పరుగులతోనూ, ఫించ్ 9 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు.