బంగ్లా సిరీస్‌పై వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

భారత్ మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ ను ఓడించడానికి బంగ్లాకు మంచి అవకాశం లభించిందన్నారు.

Update: 2019-10-31 13:54 GMT

భారత్ మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ ను ఓడించడానికి బంగ్లాకు మంచి అవకాశం లభించిందన్నారు. బంగ్లాదేశ్ జట్టు మూడు టీ20, రెండు టెస్టు సిరీస్‌లో భారత్‌లో పర్యటించనుంది. బంగ్లా ఆటగాళ్లు బ్యాటింగ్‌లో రాణిస్తే టీమిండియాకు పోటీ ఇవ్వడం ఖాయమని లక్ష్మణ్ అన్నారు. భారత్ గడ్డపై టీమిండియాను ఓడించే అవకాశం మరోసారి బంగ్లాకు రాదని వ్యాఖ్యానించారు.

బంగ్లా జట్టుకు బలహీనత బౌలింగ్ మాత్రమే అని , వారి బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉందన్నారు. భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌లో ముస్తాఫిజుర్‌ కీలక పోషించాల్సిన అవసరం ఉందని లక్ష్మణ్ పేర్కొన్నారు. విరాట్‌ కోహ్లి విశ్రాంతి తీసుకున్నాడని, మిడిల్ ఆర్డర్ అనుభవ లేమి భారత్ సమస్యగా మారింది. బంగ్లా సిరీస్ యువ క్రికెటర్లకు గొప్ప అవకాశం అన్నారు. అయినప్పటికీ భారత్‌ 2-1 తేడాతో గెలుస్తుందనే భావిస్తున్నా అని లక్ష్మణ్‌ పేర్కొన్నాడు.

Tags:    

Similar News