అభిమానిని గుండెలు హత్తుకున్న కోహ్లీ
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై తనకున్న అభిమానాన్ని వినూత్నరీతిలో చాటుకున్నాడు ఓ అభిమాని
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై తనకున్న అభిమానాన్ని వినూత్నరీతిలో చాటుకున్నాడు ఓ అభిమాని. కోహ్లీపై తనకున్న అభిమానాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనుకున్నాడు. ఒళ్లంతా ట్యాటూలు వేయించాడు. విరాట్ కోహ్లికి ఫోటోలను జెర్సీ నంబర్ 18 అంకెతో సహా ఒంటిపై 16 చోట్ల ట్యాటూలు వేయించాడు.
పింటు బెహరా అనే వ్యక్తి భారత క్రికెటర్ కోహ్లీకి వీరాభిమాని. అతను కోహ్లీని కాలవాలనే ఉద్దేశ్యంతో 2016 నుంచి పైసా పైసా పోగుచేసి తాను అనుకున్నది సాధించిచాడు. ఎట్టకేలకు వెస్టిండీస్‌తో మూడో వన్డేకు ముందు ప్రాక్లీస్ లో మునిగిపోయిన భారత్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లిని కలిశాడు. పింటు బెహరా కోహ్లీకి తన ఒంటిపై ఉన్న ట్యాటూలను చూపించాడు. దీంతో విరాట్ కోహ్లీ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. పింటు బెహరాను ఒక్కసారిగా దగ్గరకు పిలిచి గుండెలకు హత్తుకున్నాడు.
ఈ పచ్చబొట్లపై పింటు బెహరా స్పందించాడు. నేను క్రికెట్ అభిమానిని అంతకంటే విరాట్ కోహ్లి అంటే పిచ్చి. ఆటపై కోహ్లీకి ఉన్న అంకితభావం చూసి కోహ్లీకి అభిమానిగా మారాను. కోహ్లీపై అభిమానాన్ని క్రికెట్ ప్రపంచానికి చాటి చెప్పాలని అనుకున్నాను. అందుకే ఒంటినిండా పచ్చబొట్లు వేయించుకోవాలని నిర్ణయించుకున్న. దీనికోపం డబ్బులు పోగుచేసి ట్యాటు వేయించుకున్నా. ఇందుకు రూ.లక్ష ఖర్చయింది. ఇండియాలో కోహ్లి ఆడే ప్రతి మ్యాచ్ కు వెళ్తాను.అని పింటు బెహరా చెప్పాడు. అయితే పింటు బెహరాకు చెందిన ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.