వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన విండీస్

Update: 2019-06-17 12:18 GMT

వరల్డ్ కప్ టోర్నీలో వెస్టిండీస్, బంగ్లాదేశ్ ల మధ్య ఈరోజు మ్యాచ్ జరుగుతోంది. బంగ్లాదేశ్ బౌలర్లు విండీస్ బ్యాట్స్ మెన్ ను కట్టడి చేయలేకపోతున్నారు. వికెట్ తీశామన్న సంతోషం కొద్దీ సేపు కూడా ఉండటం లేదు బంగ్లా ఆటగాళ్లకు. దూకుడుగా ఆడిన పూరం 30 బంతుల్లో 25 పరుగులు చేసి మరో భారీ షాట్ కోసం ప్రయత్నించి ఔటయ్యాడు. హాసన్ వేసిన 33 వ ఓవర్లో సౌమ్య సర్కార్ కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగారు. ఈ దశలో బ్యాటింగ్ కు దిగిన హిట్ మేయర్ బంగ్లా బౌలర్లను ఆడుకున్నాడు. కేవలం 26 బంతుల్లో 50 పరుగులు చేసి ఔటయ్యాడు. సుడిగాలిలా విరుచుకు పడిన హిట్ మేయర్ నాలుగు ఫోర్లు.. మూడు సిక్స్ లు బాది తన అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతను ఔటైన తరువాత క్రీజులోకి వచ్చిన రస్సెల్ రెండు బంతులు ఆడిఒక్క రానూ చేయకుండానే రెహమాన్ బౌలింగ్ lO రహీమ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరో వైపు హోప్(82  ) జాగ్రత్తగా ఆడుతూ సెంచరీ వైపు పరుగులు తీస్తున్నాడు. దీంతో విండీస్ 40 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది. 

Tags:    

Similar News