US Open Men's Finals: 'నాదల్' విజయ నాదం

Update: 2019-09-09 03:33 GMT

యూఎస్ ఓపెన్ మెన్స్ ఫైనల్స్ లో స్పెయిన్ టెన్నిస్ వీరుడు రాఫెల్ నాదల్ ఘన విజయం సాధించాడు. నువ్వా, నేనా అన్నట్టు సాగిన యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ తుదిపోరులో ఉన్నత విజయాన్ని సొంతం చేసుకుని టోర్నీ గెలిచాడు నాదల్. రష్యాకు చెందిన డానియల్ మేద్వెద్వేవ్ ను 7-5, 6-3, 5-7, 4-6, 6-4 తేడాతో ఓడించాడు. తొలిసారిగా గ్రాండ్ స్లామ్ టోర్నీలో ఫైనల్స్ ఆడిన డానియల్ మేద్వెద్వేవ్ రాఫెల్ నాదల్ కు గట్టి పోటీ ఇచ్చాడు. మొదట్లో వరుసగా 7-5, 6-3, తేడాతో రెండు సెట్లు ఓడిపోయినా డానియల్ మేద్వెద్వేవ్ మంచి పోరాట పటిమ చూపించాడు. ఆటను ఐదు రౌండ్ల వరకూ తీసుకు వెళ్ళాడు. అయితే ఆఖరి సెట్ లో రాఫెల్ అనుభవం ముందు తలవంచాడు డానియల్ మేద్వెద్వేవ్.

ఈ టోర్నీ విజయంతో నాదల్ 19వ గ్రాండ్ స్లామ్ అందుకున్నాడు. దీంతో పురుషుల సింగిల్స్ లో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిళ్ళను గెలుచుకున్న రోజర్ ఫెదరర్ (20) రికార్డుకు ఒక్క విజయం దూరంలో నిలిచాడు నాదల్.



Tags:    

Similar News