'అంపైర్ కాల్' విధానంపై సచిన్ తీవ్ర అసంతృప్తి
అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి చెందితే 15 సెకన్ల లోపు సమీక్షకు వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే ఎల్బీడబ్ల్యూపై వెళ్లిన సమీక్షల్లో వచ్చే ఫలితాలపై ఆటగాళ్లు, మాజీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అంపైర్ కాల్ నిర్ణయంపై సర్వాత్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నిర్ణయం మార్చాలని పలువురు మాజీ క్రికెటర్లతోపాటు, అంపైర్లు కూడా ఐసీసీని కోరుతున్నాయి. తాజగా దీనిపై టీమిండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెందుల్కర్, మాజీ అంపైర్ డారిల్ హార్సర్ స్పందించారు. అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి చెందితే 15 సెకన్ల లోపు సమీక్షకు వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే ఎల్బీడబ్ల్యూపై వెళ్లిన సమీక్షల్లో వచ్చే ఫలితాలపై ఆటగాళ్లు, మాజీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రీప్లేలో థర్డ్ అంపైర్.. పిచ్చింగ్, ఇంపాక్ట్, వికెట్ అనే మూడు అంశాలను పరిశీలించి ఎల్బీపై తుది నిర్ణయాన్ని ప్రకటిస్తుంటారు.
మాజీ అంపైర్ డారిల్ హార్సర్ మాట్లాడుతూ.. స్టంప్‌కు తగిలిన బంతి బెయిల్స్‌ను పడగొడుతుంది. అయితే అంపైర్ కాల్ వివాదాలకు తావిస్తోంది. దాన్ని ఐసీసీ నిషేధించి వివాదాల నుంచి తప్పుకోవాలి. గత 12 ఏళ్లుగా ఎల్బీ రివ్యూపై ఆటగాళ్లు, అభిమానులకు గందరగోళ పరిస్థితి ఉంది. సాంకేతిక, అవగాహనలో లోపాలున్నాయని తెలియజేస్తుంది. అయితే దీనిపై ఐసీసీ దృష్టిసారించి తగిన నిర్ణయాన్ని తీసుకోవాలి అని హార్పర్ అన్నాడు. బాక్సింగ్ డే టెస్టులో థర్డ్ అంపైర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు భారత్‌కు మరికొన్ని ఆసీస్ అభిమానులకు నచ్చేలా ఉన్నాయని హార్సర్ పేర్కొన్నాడు. సచిన్ కూడా ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీనిని ఐసీసీ మరోసారి పునక్షమించాలని కోరుతున్నారు.