రెండు జట్లు.. ఇద్దరు కెప్టెన్లతో దక్షిణాఫ్రికా తో వన్డే సిరీస్

Update: 2019-08-20 06:14 GMT

ఆగస్టు 29 నుంచి ప్రారంభం కానున్న దక్షిణాఫ్రికా-ఏతో వన్డే సిరీస్‌కు బీసీసీఐ సంచలన ప్రయోగం చేస్తోంది. భారత్‌-ఏ తరఫున దక్షిణాఫ్రికా వెళ్లేందుకు ఇద్దరు కెప్టెన్ లతో రెండు జట్లను ప్రకటించింది. మరో వారం రోజుల్లో దక్షిణాఫ్రికా జట్టు ఇండియా వస్తుంది. ఐదు వన్డేల సిరీస్ లో పాల్గొంటుంది. దీనిలో తొలి మూడు వన్డేలకు మనీశ్ పాండే, చివరి రెండు వన్డేలకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ లుగా ప్రకటించారు.

యువ ఆటగాళ్లు శుభ్‌మన్‌గిల్‌, విజయ్‌ శంకర్‌, అన్‌మోల్‌ ప్రీత్‌, రికీ భుయ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, అక్షర్‌ పటేల్‌, నితీశ్‌ రాణా ఇద్దరు సారథుల నేతృత్వంలో ఆడతారు. పాండే జట్టుకు ఇషాన్‌ కిషన్‌ కీపర్‌. అయ్యర్‌ బృందంలో కేరళ స్టార్‌ సంజు శాంసన్‌ వికెట్ల వెనుక ఉంటాడు. తొలి మూడు మ్యాచులకు యుజువేంద్ర చాహల్‌ అందుబాటులో ఉంటాడు. ఆగస్టు 29, 31, సెప్టెంబర్‌ 2, 4, 8 తేదీల్లో వన్డేలు జరుగుతాయి.


Tags:    

Similar News