చైనా ఓపెన్ లో సైనాకు షాక్! తొలి మ్యాచ్ లోనే టోర్నీ నుంచి ఔట్!
చైనా ఓపెన్ టోర్నీ తొలి మ్యాచ్ లోనే భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఓటమి పాలైంది. దీంతో ఆమె టోర్నీ నుంచి నిస్క్రమించింది.
భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ కు ఊహించని షాక్ తగిలింది. చైనా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీ తొలి రౌండ్ లోనే ఆమె ఓటమి పాలైంది. బుధవారం ప్రారంభామైన టోర్నీలో తొలి మ్యాచ్ సైనా థాయ్ ల్యాండ్ క్రీడాకారిణి బుసానన్ లమధ్య జరిగింది.
ఈ టోర్నీలో 8 వ ర్యాంక్ క్రీడాకారిణిగా బరిలో దిగిన సైనా పై 19 వ ర్యాంక్ క్రీడాకారిణి బుసానన్ విజయం సాధించింది. 45 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ లో తొలి గేమ్ ను 10-21 తో కోల్పోయింది. దీనితో రెండో గేమ్ లో బుసానన్ కు గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేసినా అది ఫలించలేదు. దాంతో సైనా 17-21 తేడాతో రెండో గేమూ దానితో మాటు మ్యాచ్ కూడా కోల్పోయింది. బుసానన్ చేతిలో సైనా ఓడిపోవడం వరుసగా ఇది రెండోసారి కావడం గమనార్హం. ఇక ఈ ఓటమితో సైనా టోర్నీనుంచి నిష్క్రమించింది.
ఇక ప్రపంచ చాంపియన్ సింధు ఈరోజు సాయంత్రం చైనా ఓపెన్ లో తన తొలి మ్యాచ్ ఆడనుంది.