భారత విజయ లక్ష్యం 150
భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడం తొ దక్షిణాఫ్రికా జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.
సౌతాఫ్రికా తొ జరుగుతున్న రెండో టీ 20 మ్యాచ్ లో భారత జట్టు కెప్టెన్ కోహ్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే, భారత బౌలర్లను కొంతవరకూ దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ సమర్థవంతంగానే ఎదుర్కున్నారు. టీమిండియా బౌలర్లు కూడా వికెట్లు త్వర త్వరగా పడగోట్టలేక పోయినా పరుగులను చాలా వరకూ నియంత్రిన్చారని చెప్పవచ్చు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నస్తానికి పరుగులు చేసింది.
డికాక్ సమర్థవంతంగా ఆడాడు. 37 బంతుల్ల్లో 52 పరుగులు చేశాడు. ఇక అతనికి తోడుగా నిలిచినా బావుమా తన అర్థసెంచరీని ఒక్క పరుగు తేడాతో కోల్పోయాడు. 43 బంతుల్లో 49 పరుగులు చేసి అవుటయ్యాడు. వీరిద్దరి తరువాత మైలర్, ప్రితోరియాస్ ఇద్దరే రెండంకెల స్కోరు సాధించారు.
భారత్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3 ఓవర్లు బౌలింగ్ చేసి 19 పరుగులిచ్చాడు. దీపక్ చాహర్ 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి 2 వికెట్లు తీసాడు. ఇక నవదీప్ షైనీ నలుగు ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి ఒక వికెట్, జడేజా 4 ఓవర్లలో 31 పరుగులిచ్చి ఒక వికెట్ తీశారు.
మ్యాచ్ లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి