టీమిండియా మంచి స్కోరు సాధించే దిశగా దూసుకెళుతోంది. ఓపెనర్లు ఇద్దరూ పాకిస్థాన్ బౌలర్లపై మంచి పట్టు సాధించారు. పాక్ బౌలర్లు వారిపై ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయారు. పదహారు ఓవర్లకు టీమిండియా నూరు పరుగులు పూర్తి చేసుకుంది. రోహిత్ శర్మ తన అర్థసెంచరీ పూర్తి చేసుకుని సెంచరీ వైపు పరుగులు తీస్తున్నాడు. మరోపక్క కెఎల్ రాహుల్ అతనికి సహకరిస్తూనే.. పరుగులు రాబడుతున్నాడు. మొత్తమ్మీద 20 ఓవర్లు పూర్తయే సరికి టీమిండియా 105 పరుగులు చేసింది. కెఎల్ రాహుల్ 64 బంతుల్లో 39 పరుగులు, రోహిత్ శర్మ 57 బంతుల్లో 63 పరుగులూ చేసి పాక్ బౌలర్లను ఆడుకుంటున్నారు.