దీని భావమేమి క్రికెట్టాధీశా..!

Update: 2019-06-05 13:59 GMT

ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీ ని ఐసీసీ టీమిండియా గెలవాలని కోరుకుంటోందా? టీమిండియా కెప్టెన్ క్రికెట్లో రారాజని ప్రపంచ క్రికెట్ సంఘం భావిస్తుందా? కచ్చితంగా భారత జట్టుకే ఈ టోర్నీలో వియావకాశాలు ఉన్నాయని క్రికెట్ ప్రపంచం నమ్ముతోందా..? ఇవేమిటి ఇన్ని ప్రశ్నలు అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం.. ఈరోజు ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఇండియా తన తొలి మ్యాచ్ ను దక్షిణాఫ్రికా తో ఆడుతోంది. వారం రోజుల క్రితం ప్రారంభమైన ఈ టోర్నీలో ఫేవరేట్ జట్లలో ముందు వరుసలో ఉన్న టీమిండియా మాత్రం చాల ఆలస్యంగా తన మొదటి మ్యాచ్ ఆడుతోంది. ప్రత్యర్థిగా బరిలోకి దిగుతున్న దక్షిణాఫ్రికా ఇప్పటికే రెండు మ్యాచులు ఆడేసింది. ఇక ఇండియా ఈ రోజు మ్యాచ్ ఆడుతుంటే టీమిండియా కప్పు గెలవాలంటూ ట్వీట్లు వెల్లువెత్తాయి. ప్రధాని మోడీ తో సహా పలువురు నాయకులు, అభిమానులు టీమిండియా కు శుభాకాంక్షలు తెలిపారు. అయితే, ప్రపంచ క్రికెట్ సంఘం మాత్రం కొద్దిగా వెరైటీగా తన శుభాకాంక్షలు అందించింది. 

కోహ్లీ ఫొటోను ట్విట్టర్ లో ఉంచింది. అది సాధారణముగా ఏమీ లేదు సింహాసనం పై కోహ్లీ చక్రవర్తి గెటప్ లో కూచుని వున్న ఫోటో అది. దానిలో గోడపై టీమిండియా గతంలో కప్ గెలిచినా 1975 , 2011 సంవత్సరాలను గుర్తు చేస్తూ ఓ కేలండర్ ఉంది.. ఇక కోహ్లీయే ఓ చేత్తో బాట్, మరో చేత్తో బాల పట్టుకుని తలపై కిరీటంతో ఇండియా రంగుల జెండాని గుండెలపై ధరించి ఉన్నాడు. అంతే కాదు..1 . వి. కోహ్లీ అని రాసున్న ట్రోఫీ కూడా ఫొటోలో కనిపిస్తోంది. ఇదిప్పుడు చర్చనీయాంశంగా మారింది. క్రికెట్ అభిమానుల్లో.. ముఖ్యంగా టీమిండియా అభిమానులు దీని అర్థం ఏమిటని పై విధంగా ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు. 


Tags:    

Similar News