టీమిండియా రిజర్వ్ బెంచ్ అద్భుతం, రెండు టీంలతో ఆడడం హర్షణీయం: ఇంజమామ్
టీమిండియా రిజర్వ్ బెంచ్ బలంగా తయారైందని, రెండు టీంలతో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడడం హర్షణీయమని ఇంజమామ్ ఉల్ హాక్ అన్నాడు.
Team India: టీం ఇండియా రిజర్వ్ బెంచ్ చాలా బలంగా తయారైందని, రెండు టీంలతో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడడం హర్షణీయమని ఇంజమామ్ ఉల్ హాక్ అన్నాడు. ప్రస్తుతం భారత్‌కు ఆడేందుకు 50 మంది ప్లేయర్స్ సిద్ధంగా ఉన్నారని కొనియాడారు. ఆస్ట్రేలియా టీం కు కూడా ఇలాంటి అవకాశం లేదని అన్నాడు. క్రికెట్ ప్రపంచాన్ని ఆస్ట్రేలియా ఏలుతున్న టైంలోనూ.. ఆ టీం తరపున ఆడేందుకు రెండు బలమైన జట్లను తయారు చేయడం సాధ్యం కాలేదని వాపోయారు. కానీ, టీం ఇండియా మాత్రం రెండు టీంలతో అంతర్జాతీయ స్థాయి మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమైందని పేర్కొన్నాడు.
తాజాగా, 23 మంది సభ్యులతో టీం ఇండియా ఇంగ్లండ్‌లో పర్యటించేందుకు బయలుదేరనున్న సంగతి తెలిసిందే. అలాగే మరో టీంను (భారత్ బి) శ్రీలంక పర్యటనకు పంపనున్నారు. ఇలాంటి పరిస్థితిని చూస్తుంటే భారత్ క్రికెట్ ఏ స్థాయిలో దూసుకపోతుందో గమనించాల్సిన విషయం అన్నారు. ప్రస్తుతం ఇండియా టీంలో సీనయర్లతోపాటు, ప్రతిభ గల యువకులు కోకొల్లుగా ఉన్నారని ప్రశంసలు కురిపించాడు ఇంజిమామ్. ఒక దేశం తరఫున రెండు నేషనల్ టీంలు పలు దేశాలతో ఒకేసారి క్రికెట్ ఆడడం.. చరిత్రలో ఇదే తొలిసారి కావొచ్చన్నాడు.