జోరుగా భారత ఆటగాళ్ల ప్రాక్టీస్.. తొలిసారి అంతా కలిసి మైదానంలోకి!

WTC Final 2021: టీమిండియా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరగనున్న ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కేవలం 8 రోజులు మాత్రమే ఉంది.

Update: 2021-06-10 10:57 GMT

టీమిండియా ఆటగాళ్ల ప్రాక్టీస్ (ఫొటో ట్విట్టర్)

WTC Final 2021: టీమిండియా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరగనున్న ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు కేవలం 8 రోజులు మాత్రమే ఉంది. దీంతో టీమ్ ఇండియా మొదటి గ్రూప్ ట్రైనింగ్ సెషన్‌ను మొదలు పెట్టింది. దాదాపు 4 వారాల తరువాత ఆటగాళ్లకు ఇదే మొదటి గ్రూప్‌ ట్రైనింగ్‌ సెషన్‌ కవాడంతో.. హుషారుగా ఓవైపు ప్రాక్టీస్, మరోవైపు వార్మప్‌లు చేశారు.

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు విరాట్ కోహ్లీ సేనకు ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్‌లు లేవు. దీంతో ఈ గ్రూప్‌ సెషన్‌లోనే ఆటగాళ్లంతా వార్మప్‌లు చేస్తూ చెమటలు చిందిస్తున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్య రహానే, ఓపెనర్ రోహిత్ శర్మ, టెస్ట్ స్పెసలిస్ట్ చేతేశ్వర్ పుజారాలు బ్యాటింగ్‌లో మునిగిపోగా, సిరాజ్, అశ్విన్, ఇషాంత్, బుమ్రా, షమీ బౌలింగ్‌లో లీనమయ్యారు. కాగా, గిల్, పంత్ బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ ప్రాక్టీస్ చేశారు. ఈ మేరకు టీమిండియా ప్రాక్టీస్‌ సెషన్‌కు సంబంధించి బీసీసీఐ కొన్ని ఫొటోలతో పాటు ఓ వీడియోని ట్విట్టర్లో షేర్ చేసింది.

ఈ మేరకు "ఇదే మా మొదటి గ్రూప్ ట్రైనింగ్ సెషన్‌. అలాగే డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం ఆటగాళ్లంతా తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. డబ్ల్యూటీసీ 21 ఫైనల్‌కు టీమ్ ఇండియా పూర్తి స్థాయిలో సిద్ధమవుతోందని" బీసీసీఐ ట్వీట్ చేసింది.

భారత క్రికెట్ జట్టు జూన్ 3 న సౌతాంప్టన్‌లో అడుగుపెట్టింది. ప్రతీ ఆటగాడు 3 రోజుల కఠిన క్వారంటైన్‌లో ఉన్నాడు. అనంతరం ప్రాక్టీస్‌ను మొదలుపెట్టారు. ఫైనల్‌కి ముందు 3 సార్లు కరోనా పరీక్షలు నిర్వహించనుననారు.

కాగా, న్యూజిలాండ్ జట్టు ఇంగ్లాండ్‌తో ఇప్పటికే ద్వైపాక్షిక సిరీస్ ఆడుతోంది. రెండో టెస్ట్ ముగిసిన తరువాత ఈ బృందం జూన్ 15 న ఈ సీబీ బయో-బుడగ నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ బబుల్‌లోకి మారనుంది. ఈ మేరకు సౌతాంప్టన్‌లో కివీస్ ఆటగాళ్లకు కూడా పరీక్షలు నిర్వంహించనున్నారు.

Tags:    

Similar News