సెలెక్షన్స్ కోసం లంచం అడిగారు విరాట్ కోహ్లీ సంచలన కామెంట్స్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెలక్షన్ కమిటీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెలక్షన్ కమిటీ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టార్ ఫుట్‌బాలర్ సునీల్ చెత్రితో కలిసి సోషల్ మీడియాలో మాట్లాడిన కోహ్లీ.. క్రికెట్ ఆడే తొలి రోజుల్లో జట్టులో సెలెక్షన్ కోసం అధికారులు లంచం అడిగితే తన తండ్రి తిరస్కరించాడని గుర్తు చేసుకున్నాడు.
ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలో రాష్ట్ర జట్టులో చోటు కోసం ఎంపిక చేయాలంటే లంచం చెల్లించాల్సి ఉంటుందని కోచ్ తన తండ్రి ప్రేమ్‌తో అన్నాడని వెల్లడించించాడు.
దీనిపై మండిపడిన ప్రేమ్ అలాంటి పనులు తను లంచం చేయబోనంటూ, స్వయం ప్రతిభతోనే తన కొడుకు జట్టులో చోటు దక్కించుకుంటాడని తండ్రి అన్నట్లుగా కోహ్లీ తెలిపాడు. ఆ సంఘటన నుంచి తాను ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని తెలిపాడు.
తమది చాలా పేద కుటుంబమని తన తండ్రి ఎన్నో కష్టాలు పడి, లాయర్ అయ్యారని తెలిపాడు. అంతకుముందు నేవీలో పనిచేశారని, తనకు ఆయన ఎప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తారని అభిప్రాయపడ్డాడు. కోహ్లీ టీమిండియాలోకి వచ్చే నాటికి అతని తండ్రి చనిపోయారు.