ఆసీస్ తో వరల్డ్ కప్ టోర్నీలో ఈరోజు ఓవల్ మైదానం లో టీమిండియా తలపడుతోంది. మొదట బ్యాటింగ్ చేస్తున్న ఇండియా 300 పరుగుల మైలురాయిని దాటింది. ఓపెనర్లు ఇచ్చిన శుభారంభానికి విరాట్ కోహ్లీయే, హార్దిక్ పాండ్యా తమ బ్యాటింగ్ బలాన్ని జోడించారు. దీంతో 46 వ ఓవర్లో టీమిండియా 300 పరుగులు పూర్తి చేసింది. పాండ్యా కేవలం 27 బంతుల్లో 48 పరుగులు వేగంగా చేశాడు. అటు తరువాహత అదే వేగంగా ఆడబోయి కమిన్స్ బౌలింగ్ లో ఫించ్ కు దొరికిపోయాడు. 46 ఓవర్లు ముగిసేసరికి ఇండియా 301 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది. కోహ్లీ, ధోనీ క్రీజులో ఉన్నారు.