నేడు ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్, ధనాధన్ వరల్డ్‌కప్‌లో అసలైన పోరు...
India vs Pakistan - T20 World Cup 2021: 28 నెలల తర్వాత భారత్, పాక్ మధ్య మ్యాచ్, క్రికెట్ అభిమానుల తీవ్ర ఉత్కంఠ...
India vs Pakistan - T20 World Cup 2021: నరాలు తెగే ఉత్కంఠ.. క్షణక్షణం చేతులు మారే ఆధిపత్యం.. మునివేళ్లపై నిలబెట్టే హైటెన్షన్.! ఇవీ.. భారత్-పాక్ దాయాదుల పోరులో ఎదురయ్యే రెగ్యులర్ భావోద్వేగాలు.! అలాంటిది ప్రపంచకప్‌లో ఇరు దేశాలు తలపడితే..? అది కూడా చాలా సంవత్సరాల తర్వాత మ్యాచ్ జరిగితే..? దుబాయ్ వేదికగా మరికొన్ని గంటల్లో ప్రారంభమయ్యే దాయాదుల పోరుపై క్రికెట్ ఫ్యాన్స్ అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రపంచ క్రికెట్ హిస్టరీలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కి ఉన్న స్థానమే వేరు.! ప్రపంచకప్ సిరీస్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ రెండు జట్లు ఎప్పుడు ఢీ కొట్టినా అభిమానులకు అందే కిక్ మాటల్లో చెప్పడమూ కష్టమే.! ఇదంతా ఒకెత్తయితే ఇటీవలి కాలంలో ఇండో-పాక్ బోర్డర్ ఉద్రిక్తతలతో ఇరు దేశాల మధ్యా హైటెన్షన్ నెలకొంది. ఇదే సమయంలో దాయాదుల పోరుకు పొలిటికల్ సెగలు కూడా తగిలాయి. టెర్రర్ పాక్‌తో ఆటలు అవసరమా అంటూ సోషల్ మీడియాలో సైతం పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఇలాంటి పరిస్థితుల్లో పాక్‌తో జరగబోయే ఫస్ట్ ఫైట్ అమాంతం ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.
వరల్డ్‌కప్ హిస్టరీలో ఇరు దేశాలు ఐదు సార్లు తలపడ్డాయి. వీటిలో టీమిండియా నాలుగు సార్లు పాక్‌ను చిత్తుగా ఓడించింది. మరో మ్యాచ్ టైగా ముగిసింది. 2007 టీ20 వాల్డ్‌కప్‌లో జిరిగిన ఈ టై మ్యాచ్‌కు కూడా బౌలౌట్ పద్ధతిలో టీమిండియానే గెలిచింది. 2007 సిరీస్‌లోనే ఇరు జట్లు ఫైనల్‌కు చేరి మొదటి ప్రపంచకప్‌ను క్రికెట్ హిస్టరీలోనే నిలిచిపోయేలా చేశాయి. ఆ మ్యాచ్‌లో దాదాపు పాకిస్తాన్ గెలిచినంత పని చేసినా.. ఆఖరి ఓవర్లో కెప్టెన్ ధోనీ తీసుకున్న కీ డెసిషన్ భారత్‌ను విశ్వ విజేతగా నిలిపింది.
మరోవైపు.. 2012లో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించింది. అలాగే, 2014, 2016 పొట్టి ప్రపంచకప్‌లలోనూ టీమిండియా అద్భుత ప్రదర్శనలతో ఘన విజయాలను సొంతం చేసుకొంది. అయితే, ఇన్నేళ్ల తర్వాత మళ్లీ దాయాదితో మ్యాచ్ ఉండడం.. అది కూడా సిరీస్‌లోనే ఫస్ట్ మ్యాచ్ కావడంతో ఆదివారం జరిగే పోరుపై అమాంతం హైప్ క్రియేట్ అయింది. ప్రస్తుత మ్యాచ్‌లో కూడా టీమిండియానే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.