T20 World Cup : ఆదిలోనే కీలక వికెట్ కోల్పోయిన టీమిండియా
మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీంమిడియా ఆదిలోనే కీలక వికెట్ కోల్పోయింది.
మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీంమిడియా ఆదిలోనే కీలక వికెట్ కోల్పోయింది. బంగ్లా మ్యాచ్ లో జ్వరం కారణంగా దూరంమైన ఓపెనర్ స్మృతి మంధాన ఈ మ్యాచ్ లో తిరిగి జట్టులో చేరింది. మొదట ఫోర్ కొట్టి జోరు మీద కనిపించింది. కివీస్ బౌలర్ తాహుహు వేసిన మూడో ఓవర్ రెండో బంతికి మంధాన(11) ఔట్ అయింది. భారత్ 17 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ షెఫాలీ వర్మ(12), తానియా భాటియా(5) ధాటిగా అడుతున్నారు. నాలుగు ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 33 పరుగులు చేసింది.
అంతకుముందు ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ సారథి సోఫీ డివైన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కాగా, తొలి టీ20లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను కంగుతినిపించిన టీమిండియా తర్వాతి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్ విజయం సాధిస్తే భారత్ గ్రూప్-ఎ నుంచి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోనుంది.
తుది జట్లు:
భారత్ జట్టు
హర్మన్‌ప్రీత్‌కౌర్ (కెప్టెన్), , షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, తానియా భాటియా, దీప్తి శర్మ, వేదా కృష్ణమూర్తి, శిఖా పాండే, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్ , పూనమ్ యాదవ్
కివీస్ జట్టు:
సోఫీ డివైన్(కెప్టెన్), సుజీ బేట్స్, రేచల్ ప్రీస్ట్, మాడీ గ్రీన్, కాటీ మార్టిన్, అమేలియా కెర్ర, హయ్‌లీ జెన్‌సెన్, లీ కాస్పెరెక్, అన్నా పీటర్‌సన్, లీ తాహుహు, రోజ్‌మెరీ మెయిర్